ఆ వ్యక్తితో శ్రీముఖి ప్రేమలో ఉన్నారా.. హగ్ ఇస్తూ ఐ లవ్ యు చెబుతూ?

టాలీవుడ్ టాప్ యాంకర్లలో ఒకరైన శ్రీముఖి బిగ్ బాస్ షో తర్వాత కొంతకాలం యాంకరింగ్ కు దూరంగా ఉన్నారు.

ఆ ప్రభావం శ్రీముఖి కెరీర్ పై కూడా పడింది.

గతంతో పోల్చి చూస్తే శ్రీముఖికి సినిమా ఆఫర్లు కూడా తగ్గాయనే సంగతి తెలిసిందే.ప్రస్తుతం శ్రీముఖి సరిగమప అనే సింగింగ్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తుండగా ఈ షోకు పరవాలేదనే స్థాయిలో రేటింగ్స్ వస్తుండటం గమనార్హం.

అయితే ఈ షోలో గత కొన్ని వారాల నుంచి శ్రీముఖి శ్రీ చరణ్ పై జోక్స్ వేస్తుండటం గమనార్హం.శ్రీముఖి షోలో తొలిప్రేమలో కీర్తి రెడ్డి ఇంట్రడక్షన్ సీన్ లో చేసినట్టు చేసి ఇది చూసిన తర్వాత చరణ్ కచ్చితంగా పడిపోయే తీరాలి అని చెప్పారు.

జడ్జి స్మిత శ్రీ చరణ్ ఎందుకు ఈ పాట పాడానురా బాబు అని పడిపోయి ఉంటాడని చెప్పుకొచ్చారు.ఆ తర్వాత చరణ్ శ్రీముఖికి ఐ లవ్ యు చెబుతున్నట్టు ఎక్స్ ప్రెషన్లు ఇచ్చారు.

Advertisement

అయితే చరణ్ షూ లేస్ కట్టుకుని అందరికీ షాకిచ్చారు.షూ లేస్ లూజ్ అయిపోయాయి టైట్ చేసుకుంటున్నా అని చరణ్ చెప్పగా నువ్వు లూజే షూ లేస్ అయినా టైట్ గా కట్టుకో అని శ్రీముఖి చెప్పుకొచ్చారు.

నాలో అర సెకను పాటు ఆశ రేపావని శ్రీముఖి కామెంట్లు చేశారు.గతంలో శ్రీ చరణ్ తో కలిసి డ్యాన్స్ చేసిన శ్రీముఖి ఆ సమయంలో హగ్ ఇచ్చారనే సంగతి తెలిసిందే.

తాజా ఎపిసోడ్ లో శ్రీ చరణ్ కు నా మనసులో మాటను ఎన్నోసార్లు చెప్పానని శ్రీముఖి తెలిపారు.

నేను ఎన్నిసార్లు ఐ లవ్ యు చెప్పినా చరణ్ పట్టించుకోవడం లేదని శ్రీముఖి కామెంట్ చేశారు.శ్రీముఖి చరణ్ పై ప్రేమను కనబరుస్తూ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.శ్రీ చరణ్, శ్రీముఖి నిజంగా ప్రేమలో ఉన్నారో లేక షో కోసం ఈ విధంగా చేస్తున్నారో తెలియాల్సి ఉంది.

Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo

శ్రీముఖికి పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది.

Advertisement