తెలుగు రాష్ట్రాల్లో హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తి.. ఐసీఎంఆర్ అలర్ట్

తెలుగు రాష్ట్రాల్లో హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తి తీవ్ర కలకలం సృష్టిస్తోంది.కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐసీఎంఆర్ తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది.

తెలంగాణ రాష్ట్రంలోనూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని తెలుస్తోంది.ఈ క్రమంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రారంభించాలని వైద్యారోగ్య శాఖ అధికారులు భావిస్తున్నారు.

అంతేకాకుండా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తోందని తెలుస్తోంది.అయితే ప్రజలలో హెర్డ్ ఇమ్యానిటీతో హెచ్3ఎన్2 వ్యాప్తిని నియంత్రించవచ్చని కొందరు వైద్యులు చెబుతున్నారు.

ప్రస్తుతం టెస్ట్ ల కోసం బ్లడ్ శాంపిల్స్ ను ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ కు పంపుతున్నారని సమాచారం.కేసులు మరింత పెరిగితే టెస్టులు నిర్వహించేందుకు ఫీవర్ ఆస్పత్రితో పాటు వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ సెంటర్లను ప్రారంభించనున్నట్లు ఫీవర్ ఆస్పత్రి తెలిపింది.

Advertisement
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

తాజా వార్తలు