తెలంగాణలో ఆరు జిల్లాలకు స్పెషల్ అధికారులు

తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ క్రమంలో అప్రమత్తమైన ప్రభుత్వం ఆరు జిల్లాలకు స్పెషల్ అధికారులను నియమించింది.

వరద బాధిత జిల్లాలకు స్పెషల్ అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఇందులో భాగంగా ములుగు జిల్లాకు స్పెషల్ అధికారిగా కృష్ణా ఆదిత్య, భూపాలపల్లి జిల్లాకు పి.గౌతమ్, నిర్మల్ జిల్లాలకు ముషారఫ్ అలీ, మంచిర్యాల జిల్లాకు భారతి హోలికేరి, ఆసిఫాబాద్ జిల్లాలకు హనుమంతరావు, పెద్దపల్లి జిల్లాకు స్పెషల్ అధికారిగా సంగీత సత్యనారాయణ నియామకం అయ్యారు.భారీ వర్షాల నేపథ్యంలో పలు ప్రాంతాలు నీటమునగగా లోతట్టు ప్రాంతాలు అన్నీ జలమయం అయ్యాయి.

దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Kirol Bet Bonuses And Promotions : A Value Assessment For Experienced Players
Advertisement