చిన్మయి సింగిల్ గా ఉందంటే ప్రపంచంలో అబ్బాయిలు వేస్ట్ అనిపించింది: రాహుల్ రవీందర్

టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా,డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో సింగర్ చిన్మయి శ్రీపాద ( Chinmayi Sripada ) ఒకరు.

ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు రాహుల్ రవీందర్ ( Rahul Ravinder ) ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

ఇలా వీరిద్దరు తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతూ ఉన్నారు.ఇలా వ్యక్తిగత జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఈ దంపతులు తాజాగా అలా మొదలైంది ( Ala Modalyindi ) కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా చిన్మయితో రాహుల్ ప్రేమలో పడిన విషయం గురించి వెల్లడించారు.

If Chinmayi Was Single, The Boys In The World Felt Like A Waste , Chinmayi Srip

ఈ కార్యక్రమంలో భాగంగా వెన్నెల కిషోర్ ( Vennela Kishore ) అసలు మీ కథ ఎలా మొదలైంది అని ప్రశ్నించడంతో చిన్మయి సమాధానం చెబుతూ అందాల రాక్షసి సినిమా డబ్బింగ్ చెప్పేటప్పుడు సినిమా విషయాలు తనకు చెప్పడానికి రాహుల్ వచ్చాడని తనని చూడడం అదే మొదటిసారి అని చిన్మయి తెలిపారు.ఇక రాహుల్ ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ.అందాల రాక్షసి సినిమా డబ్బింగ్ చెప్పేటప్పుడు తనని చూసానని ఈ అమ్మాయి గొంతు చాలా బాగుందనిపించిందని తెలిపారు.

Advertisement
If Chinmayi Was Single, The Boys In The World Felt Like A Waste , Chinmayi Srip

అయితే అప్పటికే ఆమె స్టార్ సింగర్.తనకు మాత్రం ఇంకా రెండో సినిమానే అని రాహుల్ తెలిపారు.

ఈ సినిమా డబ్బింగ్ పూర్తి అయిన తర్వాత ఈమె టీం అందరిని టాగ్ చేస్తూ సినిమా చాలా అద్భుతంగా ఉందని చెప్పారు.

If Chinmayi Was Single, The Boys In The World Felt Like A Waste , Chinmayi Srip

ఇలా తను మెసేజ్ చేయడంతో ఈ అమ్మాయి కాదు తన ఆలోచనలు కూడా బాగున్నాయి అనిపించింది.ఈమె మెసేజ్ చేయడంతో తాను కూడా రిప్లై ఇచ్చి అలా తనతో మాటలు కలిపానని రాహుల్ తెలిపారు.ఇలా మా ప్రయాణం మొదలైందని రాహుల్ రవీందర్ ఈ సందర్భంగా వెల్లడించారు.

ఇక తనతో చాట్ చేస్తున్నప్పుడు తను ఎవరితోనైనా రిలేషన్ లో ఉందా లేక సింగిల్ గా ఉందా అని ఆలోచించానని, అయినా ఇంత మంచి అందమైన అమ్మాయి సింగిల్ గా ఉంది అంటే ఈ ప్రపంచంలో అబ్బాయిలందరూ చాలా వేస్ట్ అనిపించిందని రాహుల్ ఈ సందర్భంగా తెలియజేశారు.అయితే ఆమెతో చాట్ చేసుకుంటూనే తన ప్రేమ విషయాన్ని పెళ్లి విషయాన్ని కూడా చెప్పానని రాహుల్ ఈ సందర్భంగా తన ప్రేమ పెళ్లి విషయం గురించి తెలియజేస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు
Advertisement

తాజా వార్తలు