బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల‌కు స్పీక‌ర్ నోటీసులు..!

బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ కు అసెంబ్లీ స్పీక‌ర్ పోచారం శ్రీనివాసరెడ్డి నోటీసులు ఇచ్చే అవ‌కాశం ఉంది.

స్పీక‌ర్ పై ఈట‌ల చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారాన్ని రేపాయి.

బీఏసీ స‌మావేశానికి బీజేపీని ఆహ్వానించ‌క‌పోవ‌డంపై ఈట‌ల మండిప‌డ్డారు.ప్ర‌భుత్వం చెప్పిన మాట‌లు వింటూ స్పీక‌ర్ ఓ మ‌ర మ‌నిషిలా వ్య‌వ‌హ‌రించ‌వ‌ద్ద‌ని సూచించిన విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో ఈట‌ల వ్యాఖ్య‌ల‌పై నోటీసులు ఇచ్చేందుకు స్పీక‌ర్ సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు