సోనియా గాంధీకి స్వల్ప అస్వస్థత..!

కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, పార్లమెంటరీ పార్టీ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ స్వల్ప అస్వస్థతతకు గురయ్యారని తెలుస్తోంది.

ఈ మేరకు ఆమెను ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

స్వల్ప జ్వరంతో సోనియాగాంధీ బాధ పడుతున్నారని, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.కాగా ఈ సంవత్సరంలో సోనియా ఇప్పటికే రెండుసార్లు ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.

ఆగస్ట్ 31న ముంబైలో నిర్వహించిన ఇండియా కూటమి సమావేశంలో పాల్గొన్న ఆమె అంతలోనే అస్వస్థతకు గురికావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది.

వైరల్ వీడియో : ఇద్దరు వ్యక్తులను రోడ్డుపై ఈడ్చుకెళ్లిన ట్రక్ డ్రైవర్
Advertisement

తాజా వార్తలు