జగన్ తో పేచీ ! స్పీడ్ పెంచిన బీజేపీ ? 

వరుస ఓటములతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏపీ బీజేపీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పై విమర్శల దాడి మొదలుపెట్టలని  డిసైడ్ అయిపోయింది.

అందుకే అదే పనిగా వైసీపీ ప్రభుత్వం పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, జగన్ తీసుకున్న నిర్ణయాలు తప్పుపడుతూ అనేక అంశాలను లేవనెత్తుతూ విమర్శలు చేస్తోంది.

త్వరలోనే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలు ఉండడం, అక్కడ వైసీపీ కి ఎక్కువ ఛాన్స్ ఉండడం తో బిజెపి కాస్త కంగారు పడుతోంది.తిరుపతిలో గెలిచేందుకు జనసేన సైతం సీటు త్యాగం చేసే విధంగా ఒప్పించామని, ఖచ్చితంగా గెలిచి తీరాలని, లేకపోతే ముందు ముందు ఏపీలో బీజేపీ బలపడేందుకు అవకాశం ఏర్పడుతుంది  అనే ఆలోచనలో ఉన్న బీజేపీ అధిష్టానం పెద్దలు ఈ విషయంలో సోము వీర్రాజు కు సైతం తగినఅందుకే గత కొద్ది రోజులుగా సోము వీర్రాజు అదేపనిగా వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన వాలంటీర్ వ్యవస్థ పై విమర్శలు చేస్తోంది.

వాలంటీర్ ల ద్వారా వైసిపి ప్రభుత్వం ప్రజలను ప్రలోభ పెడుతోందని, వారి ద్వారా బెదిరింపులకు దిగుతోందని, వైసీపీ కి ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయని ప్రచారం చేయిస్తూ,  ఓటర్లను భయబ్రాంతులకు గురి చేస్తూ వస్తున్నారని, వీర్రాజు అదే పనిగా విమర్శలు చేస్తున్నారు.గతంలో ఇదే వాలంటీర్ వ్యవస్థను ప్రశంసిస్తూ,  ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేసినా, ఇప్పుడు ఆ విషయాన్ని మరిచి పోయి మరి బీజేపీ నేతలపై విమర్శలు చేస్తున్నారు.

తిరుపతిలో బీజేపీ కి ఎదురు దెబ్బ తగలకుండా ముందు నుంచి సోము వీర్రాజు అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటూ, ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తున్నారు. మొదటి నుంచి వైసీపీ ప్రభుత్వానికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ మేలు చేస్తూ వస్తున్న వీర్రాజు, ఇప్పుడు అకస్మాత్తుగా వ్యూహం మార్చడానికి అధిష్టానం నుంచి వచ్చిన సూచనలు, వార్నింగ్ లే కారణంగా కనిపిస్తోంది.

Advertisement
ఈ ఎండలేంట్రా బాబోయ్ .. ! 

తాజా వార్తలు