అందరి ముందు హీరో విజయ్ పై చెప్పు విసిరిన అభిమాని... ఏం జరిగిందంటే?

కోలీవుడ్( Kollywood ) ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు విజయ్ ( Vijay ) దళపతి ఒకరు.

ఇటీవల ఈయనకు ఘోర అవమానం జరిగిందని తెలుస్తోంది.

గుర్తుతెలియని వ్యక్తి ఈయనపై చెప్పు విసరడంతో ఈ విషయం కాస్త కోలీవుడ్ ఇండస్ట్రీలో చర్చలకు కారణమైంది.అసలు హీరో విజయ్ పై చెప్పు విసరడం ఏంటి? అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయానికి వస్తే.కోలీవుడ్ స్టార్ హీరో డిఎండికే నాయకుడు విజయ్ కాంత్ ( Vijaykanth )ఇటీవల మరణించిన సంగతి మనకు తెలిసిందే.

గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈయన చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకుంటున్నారు ఇలా చికిత్స తీసుకుంటూ ఉన్నప్పటికీ ఈయనకు కరోనా కూడా సోకడంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బందికరంగా మారడంతో గురువారం ఉదయం విజయ్ కాంత్ మరణించారు.ఇక ఈయన మరణించారు అనే విషయం తెలియడంతో కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన చివరి చూపుకు వెళ్లారు.

ఈ క్రమంలోనే నటుడు విజయ్ సైతం కెప్టెన్ కి నివాళులు అర్పించడానికి డిఎండికే కార్యాలయం వద్దకు వెళ్లారు.అక్కడ విజయ్ కాంత్ పార్థివ దేహానికి పూలమాలవేసి ఆయనని చివరి చూపు చూడటమే కాకుండా తన భార్య ప్రేమలత గారితో కూడా మాట్లాడి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.అనంతరం విజయ్ కాంత్ ను చూసి హీరో విజయ్ వెళ్తుండగా ఒక్కసారిగా అభిమానులు తనని చుట్టుముట్టారు ఇలా అందరూ గుంపుగా రావడంతో అక్కడ గుర్తుతెలియని ఓ వ్యక్తి విజయ్ పై చెప్పు విసిరారు.

Advertisement

అయితే అది విజయ్ వెనుక భాగం వైపు తగిలిందని తెలుస్తోంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియోలో తనపై చెప్పు పడినప్పటికీ విజయ్ మాత్రం వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్లిపోయారు.ఇక అంతలోనే మరొక అభిమాని ఆ చెప్పు తీసి బయటకు ఇస్తున్నారు.ఇక ఈ విషయం ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది కచ్చితంగా ఈ పని మరొకసారి హీరో అభిమానులే చేసి ఉంటారు అంటూ విజయ్ ఫాన్స్ మండిపడుతున్నారు కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ అజిత్ ఫ్యాన్స్ అన్న వివాదం నడుస్తూనే ఉంటుంది వీరిద్దరి మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరుగుతూనే ఉంటాయి.

ఈ క్రమంలోనే హీరో విజయ్ పై ఆ హీరో అభిమానులే చెప్పుతో దాడి చేసి ఉంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కానీ హీరో అజిత్ మాత్రం ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా విజయ్ పట్ల జరిగిన దాడిని ఆయన పూర్తిగా ఖండిస్తున్నారని చెప్పాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 5, ఆదివారం, జ్యేష్ఠ మాసం , 2022
Advertisement

తాజా వార్తలు