దేవర మూవీ ట్రైలర్ పై షాకింగ్ అప్ డేట్ వైరల్.. అప్పటివరకు ఎదురుచూపులు తప్పవా?

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) గురించి మన అందరికి తెలిసిందే.

కాగా ఎన్టీఆర్ చివరగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి సక్సెస్ ను సాధించడంతో పాటుతో ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.ప్రస్తుతం ఒకవైపు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మూవీలో( Devara Movie ) నటిస్తూనే మరోవైపు వార్ 2 సినిమాలో కూడా నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

కాగా దేవర మూవీ సెప్టెంబర్ లో విడుదల కానున్న విషయం తెలిసిందే.

Solid Buzz On Jr Ntr Devara Trailer Release Details, Jr Ntr, Devara, Devara Movi

అయితే విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు.అందులో భాగంగానే సినిమా నుంచి ఒక్కొక్క అప్డేట్ ని విడుదల చేస్తున్నారు.ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఒక రేంజ్ లో ఎదురు చూస్తున్నారు.

Advertisement
Solid Buzz On Jr Ntr Devara Trailer Release Details, Jr Ntr, Devara, Devara Movi

అయితే ఈ చిత్రం నుంచి వచ్చిన సాంగ్స్ ఆల్రెడీ భారీ హిట్ అయ్యాయి.అయితే ఇక సమయం దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్, వదిలే కంటెంట్ పరంగా కూడా స్పీడ్ పెంచాల్సి ఉంది.

ఇలా దేవర ట్రైలర్ పై( Devara Trailer ) ఇప్పుడు సాలిడ్ బజ్ అయితే వినిపిస్తుంది.దీనితో ఈ అవైటెడ్ ట్రైలర్ ని మేకర్స్ ఈ సెప్టెంబర్ మధ్యలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

Solid Buzz On Jr Ntr Devara Trailer Release Details, Jr Ntr, Devara, Devara Movi

దీనితో సెప్టెంబర్ 15కి అలా వదిలే ప్లాన్ లో ఉన్నారట.మరి దీనిపై అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది.ఇక ఈ చిత్రంకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో సినిమా రిలీజ్ కాబోతుంది.

అయితే ప్రస్తుతం తారక్ ఫ్యాన్స్ దేవర ట్రైలర్ కోసమే ఎదురు చూస్తున్నారు.కానీ ప్రస్తుతం పరిస్థితులను బట్టి చూస్తుంటే ట్రైలర్ ఇంకా ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు