శోభిత డ్రీమ్ హీరోయిన్ కావడం కదా... అసలు డ్రీమ్ ఏంటో తెలుసా?

టాలీవుడ్ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల( Sobhita Dhulipala ) ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.

తెనాలికి చెందిన ఈమె హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న త్వరలోనే నటుడు నాగచైతన్య( Nagachaitanya ) తో కలిసి ఏడడుగులు నడవబోతున్న సంగతి తెలిసిందే.

సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత నాగచైతన్య కొన్ని విభేదాల కారణంగా ఆమెకు విడాకులు ఇచ్చారు.

ఇలా నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చి అనంతరం శోభిత ప్రేమలో పడ్డారు.ఇటీవల నిశ్చితార్థం కూడా జరిగింది.ఇక నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి శోభిత పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తన పెళ్లి పిల్లలు అంటూ ఎన్నో విషయాలు వెల్లడించారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన డ్రీమ్ గురించి ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.ఈమె హీరోయిన్ కావడంతో తన డ్రీమ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అవ్వడం అనుకుంటే మాత్రం పొరపాటు పడినట్లే.

Advertisement

ఈమె డ్రీమ్ హీరోయిన్ అవడం కాదట మరి తన డ్రీమ్ ఏంటి అనే విషయానికి వస్తే.

తాను ఎకనమిస్ట్( Economist ) కావాలని కలలు కన్నదట శోభిత.రాష్ట్రపతి వద్ద పనిచేయాలని, ప్రెసిడెంట్ కి చీఫ్‌ ఎకనమిస్ట్ అడ్వెయిజర్‌గా ఉద్యోగం చేయాలని కలలు కన్నదట.ఆ డ్రీమ్ ను పుల్ పిల్ చేసుకోవడానికి తాను ఎంతగానో ఫోకస్ చేశానని తెలిపారు.

  ఇక నా స్నేహితులు ఎప్పుడూ సినిమాల గురించి హీరోల గురించి మాట్లాడుతూ ఉండగా నేను మాత్రం ఆర్బిఐ గురించి గవర్నర్ గురించి మాట్లాడుతూ ఉండే దానిని.కానీ విచిత్రం ఏంటంటే సినిమాలంటే ఆసక్తి లేని నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చానని ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

లైంగిక శ‌క్తిని దెబ్బ‌తీసే ఈ ఆహారాల‌తో జ‌ర జాగ్ర‌త్త‌!
Advertisement

తాజా వార్తలు