ఇంతకీ కేసీఆర్ కోరుకునే ఎన్నికలు ఏంటో? 

చాలా కాలంగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయనే హడావుడి జరుగుతూనే ఉంది.ఖచ్చితంగా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారు అంటూ టిఆర్ఎస్ నాయకులతో పాటు,  బిజెపి కాంగ్రెస్ నాయకులు పదేపదే ప్రకటనలు చేస్తూ వస్తున్నారు.

2014లో టిఆర్ఎస్ గెలిచిన తర్వాత 2019 సాధారణ ఎన్నికలకు వెళ్లాల్సి ఉన్నా,  2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు ముందస్తు ఎన్నికలకు కెసిఆర్ వెళ్లే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

సరిగ్గా ఇదే సమయంలో ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉండడంతో , కేసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా లేక ఉప ఎన్నికలను ఎదుర్కొంటారా అనేది తేలాల్సి ఉంది.ఎందుకంటే ఇప్పుడు మునుగోడు అసెంబ్లీ కి ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్న  నేపథ్యంలో కేసీఆర్ నిర్ణయంపై నే ఉప ఎన్నికలా.

  సాధారణ ఎన్నికలా అనేది తేలాల్సి ఉంది.వచ్చే ఏడాది అక్టోబర్ లో  తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరగాల్సి ఉంది.

Advertisement

కెసిఆర్ కూడా మొదట్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని చూసారు.ఆ మేరకు తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ విస్తృతంగా పర్యటించారు.

  జిల్లాలు, నియోజక వర్గాల్లో పర్యటిస్తూ అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు.ఇక మంత్రులు , ఎమ్మెల్యేలు అంతా జనాల్లో ఉండేలా ప్లాన్ వేశారు.

దీంతో అన్ని పార్టీలు తెలంగాణలో ఖచ్చితంగా ముందస్తు ఎన్నికలు జరుగుతాయని భావించాయి.కానీ ఆ తరువాత సాధారణ ఎన్నికలు జరుగుతాయని ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం లేదని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్ వంటి వారు ప్రకటనలు చేశారు.

అయితే బిజెపి మాత్రం ఇప్పుడు ఉప ఎన్నికల్లో సత్తా చాటుకుని టిఆర్ఎస్ ను ఇరుకును పెట్టాలని చూస్తోంది.

How Wild Robin Works For UK Mobile Players : Skill, Luck, And Geolocation Explained
How Wild Robin Works For UK Mobile Players : Skill, Luck, And Geolocation Explained

 అందుకే మునుగోడు నియోజకవర్గం లో కాంగ్రెస్ తరపున గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బిజెపిలో చేర్చుకునేందుకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కండిషన్ విధించారు.దీంతో కేసీఆర్ కూడా అలర్ట్ అయ్యారట.  తెలంగాణలో ఉప ఎన్నికలకు వెళ్లి అనవసర టెన్షన్ పడేకంటే.

Advertisement

ముందస్తు ఎన్నికలకు వెళితేనే మంచిదనే ఆలోచనలో ఉన్నారట.ఇప్పుడు ఈ విషయంలోనే  రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం ద్వారా సర్వే నిర్వహించి , ఆ ఫలితాల ద్వారా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే విషయంలో క్లారిటీ తెచ్చుకునే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం.