ఆ విషయంలో అల్లు అర్జున్ కు పోటీ ఇస్తున్న స్నేహా రెడ్డి!

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలో అల్లు అర్జున్ ఒకరు. అల్లు అర్జున్ తన మెస్మరైజింగ్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో ఎంతోమంది అభిమానులను పోగు చేసుకున్నారు.

కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా, కోలీవుడ్లో కూడా అల్లు అర్జున్ కు అభిమానులు ఎక్కువగా ఉండటం ఎంతో విశేషం.అయితే ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన అలా వైకుంఠపురం తో భారీ హిట్ ను అందుకున్న అల్లు అర్జున్ ఫుల్ జోష్ తో పుష్ప సినిమాను ప్రారంభించారు.

Allu Arjun Workout With Wife Sneha Reddy, Allu Arjun, Sneha Reddy, Gym, Social

పుష్ప సినిమా షూటింగ్ జరుగుతుండగా, కరోనా తీవ్రతతో లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది.అయితే గత రెండు రోజుల నుంచి ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నట్లు సమాచారం.

సినిమాలలో హీరో, హీరోయిన్లు ఎంతో ఫిట్ గా, యంగ్ గా కనిపిస్తుంటారు.వారి ఫిట్నెస్ కాపాడటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

Advertisement

ఈ తరహాలోనే తన ఫిట్నెస్ కాపాడుకోవడం కోసం అల్లు అర్జున్ గంటల తరబడి జిమ్ చేస్తున్నారు.అయితే తనతో పాటు తన భార్య స్నేహారెడ్డి తో కలిసి జిమ్ కసరత్తులు చేయడం ఎంతో విశేషం.

ప్రతి విషయంలోనూ ఎంతో స్టైలిష్ గా ఉండే అల్లు అర్జున్ జీవితంలో నే కాకుండా, జిమ్ లో కూడా తన భాగస్వామి స్నేహారెడ్డి అల్లుఅర్జున్ కు గట్టి పోటీ ఇస్తున్న విషయం వీరి వర్క్ ఔట్ చేసిన వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.ఇందులో స్నేహ ట్రేడ్‌మిల్‌లో వ్యాయామం చేస్తుండగా బన్నీ లెగ్ వ్యాయామం చేయటం ఈ వీడియోలో గమనించవచ్చు.

సోషల్ మీడియా వేదికగా ద్వారా స్నేహా రెడ్డి ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులను సందడి చేస్తుంటారు.ఎప్పటికప్పుడు తన పిల్లల ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎంతో చురుకుగా కనిపిస్తుంటారు.

రీసెంట్ గా హలోవిన్ డే సందర్భంగా తన పిల్లలను వెరైటీ గెటప్ లో తయారు చేసి వారి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఈ వీడియోలో అల్లు అయాన్, అర్హ నెటిజన్లను భయపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఎంతో ముద్దు ముద్దుగా ఉన్నారు.

హీరో హీరోయిన్స్ గా నటించి అన్నాచెల్లెళ్లుగా చేసిన టాలీవుడ్ యాక్టర్స్

ప్రస్తుతం ఈ చిన్నారుల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు