స్కూల్ బ్యాగ్ లో పాము కలకలం, బుక్ ఓపెన్ చేయగానే బుస్సుమంటూ..!

మధ్యప్రదేశ్ రాష్ట్రం శివపురి జిల్లాలోని బదౌని పాఠశాలలో పాము కలకలం రేపింది.పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఎప్పట్లాగే ఇంటి నుండి పాఠశాలకు వచ్చింది.

సమయానికి తరగతి గదిలోకి వచ్చి కూర్చుంది.అంతలోనే టీచర్ వచ్చి పాఠాలు బోధించడానికి పుస్తకాలు ఓపెన్ చేయమన్నారు.

ఆ విద్యార్థి బ్యాగులో నుండి పుస్తకాన్ని తీసేటప్పుడు అందులో పాము ఉండటాన్ని గమనించి కేకలు వేసింది.దీంతో ఒక్కసారిగా విద్యార్థులు, ఉపాధ్యాయులు భయపడి బయటకు పరుగులు తీశారు.

తర్వాత పుస్తకాల బ్యాగును ఖాళీ ప్రదేశంలోకి తీసుకు వెళ్లి ఆ పామును బ్యాగులో నుండి బయటకు తీశారు.ఆ పాము పిల్లను అడవిలో వదిలేశారు.

Advertisement

పొన్నూరు పట్టణంలోని ఒక ప్రభుత్వ మద్యం దుకాణంలో ఓ యువకుడు మద్యం బాటిల్ కొనుగోలు చేయగా దానిలో పాముపిల్ల రావడంతో కంగుతిన్న యువకుడు.దీంతో మద్యం బాటిల్ లో పాము పిల్ల కనబడడంతో చుట్టుపక్కల ఉన్నవారు భయాందోళనకు లోనయ్యారు.

ఆ యువకుడు మద్యం బాటిల్ ని తీసుకొని కొనుగోలు చేసిన ప్రభుత్వ మద్యం షాపులో ప్రశ్నించగా మద్యం షాపు నిర్వాహకులు యువకుడికి మరో బాటిల్ మార్చి ఇచ్చారు.దీని మీద అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.పాము పిల్లలు చిన్నగా, సన్నగా ఉంటాయి.

అవి ఎక్కడైనా వెళ్లి నక్కి దాక్కుంటాయి.చిన్న పాటి రంధ్రం అయినా పాము పిల్లలకు చాలు.

అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉండే వాళ్లు క్రిమి కీటకాలు, సర్పాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

రతన్ టాటా స్థాపించిన మొత్తం కంపెనీలు ఇవే..?
Advertisement

తాజా వార్తలు