మోడీ సోషల్‌ మీడియాను వదిలేయడంపై చిన్న ట్విస్ట్‌

ఇండియాలో సోషల్‌ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్‌ ఉన్న వ్యక్తుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ ముందు ఉంటారు.ఇక రాజకీయ నాయకుల్లో అత్యధిక ఫాలోయింగ్‌ ఉన్న వారు ఎవరు అంటే నరేంద్ర మోడీ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఎప్పటి నుండో సోషల్‌ మీడియాలో ఉంటున్న స్టార్స్‌ను కూడా పక్కకు నెట్టి మోడీ నెం.1 స్థానంలో ఉన్నాడు.సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే మోడీ ఉన్నట్లుండి తాను సోషల్‌ మీడియాను వదిలేయ బోతున్నట్లుగా ప్రకటించాడు.

మోడీ సోషల్‌ మీడియాను వదిలేయబోతున్నట్లుగా వచ్చిన వార్తలతో అంతా అవాక్కయ్యారు.కాని కొద్ది గంటల తర్వాత మోడీ అసలు విషయాన్ని చెప్పాడు.తాను సోషల్‌ మీడియాను పూర్తిగా వదిలేయడం లేదు.

Small Twist Why Narendra Modi Left The Social Media-మోడీ సోషల�

ఆదివారం నాడు మహిళ దినోత్సవం సందర్బంగా నా అకౌంట్స్‌ పూర్తిగా వారి ఆదీనంలోకి ఇచ్చేస్తున్నారు.వారు తమ రంగాల్లో సాధించిన విజయాలను ఇతరులు ఇన్సిపైర్‌ అయ్యే విధంగా పోస్టులు పెట్టాలి అంటూ పిలుపునిచ్చాడు.

మొత్తానికి మోడీ సోషల్‌ మీడియా వదలడం లేదన్నమాట.మళ్లీ సోమవారం నుండి ఆయన అకౌంట్‌ ఆయనకే ఉంటాయి.

Advertisement
మొటిమలపై నిమ్మరసాన్ని ఈ 5 పద్ధతుల్లో ఉపయోగించాలి

తాజా వార్తలు