వేడి తట్టుకోలేక ఫ్యాన్ స్పీడుగా పెట్టుకొని నిద్రపోతున్నారా..? అయితే జాగ్రత్త..!

వేసవికాలం( Summer ) మొదలైనప్పటి నుంచి ఇప్పుడు జూన్ రెండో వారం గడుస్తున్నా కూడా రుతుపవనాల జాడలేదు.ఇంకా వేడి అలాగే కొనసాగుతూ ఉంది.

ఇలాంటి వేడి వాతావరణంలో ప్రతి ఇంట్లో కూడా 24 గంటలు ఫ్యాన్ నడుస్తూనే ఉంది.ఎందుకంటే ఫ్యాన్ ( Fan ) ఉంటేనే వేడికి గదిలో ఉండగలం.

ఇక గదిలో తిరుగుతున్న ఫ్యాన్ ఒకసారి గమనించి చూడాలి.దాని బ్లేడ్ల మీద దుమ్ము కనిపిస్తుంటే అది ఆన్ చేసిన ప్రతిసారి కణాలు గాలిలో ఎగురుతాయి.

ఫ్యాన్ పెద్ద స్పీడ్ లో పెట్టుకోవడం వలన చర్మం ( Skin ) కూడా పొడిబారి పోతుంది.అంతేకాకుండా పెద్ద ఫ్యాన్ గాలి వలన నాసిక మార్గాలు కూడా పొడిబారి పోతాయి.

Advertisement

దీంతో ముఖానికి, మెదడుకు నేరుగా గాలి తగిలి ఉదయాన్నే స్టిఫ్ నెక్ సమస్యలు ఎదురవుతాయి.

అలాగే నిరంతరంగా గాలి తగిలితే కండరాలు బిగుసుకుపోతాయి.అలాంటప్పుడు కొన్ని చిట్కాలు పాటించడం మంచిది.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రాత్రిపూట ఫ్యాన్ చిన్నగా పెట్టుకొని పడుకోవడం వలన కష్టం అనిపించేవారు మంచం దగ్గర ఒక గిన్నెలో చల్లని నీళ్లు పెట్టుకుని అప్పుడప్పుడు కర్చీఫ్ లేదా నాప్కిన్ ఆ నీటిలో ఉంచి అవసరమనుకున్న చోట కాపడం పెట్టుకోవాలి.ఇక నిద్రపోయే ముందు చల్లని నీళ్లతో స్నానం చేయడం వలన మంచి నిద్ర వస్తుంది.

ఇక మధ్యాహ్న సమయంలో కిటికీలు, తలుపులు మూసి ఉంచుకోవాలి.దీని వలన మధ్యాహ్న సమయంలో ఉండే వేడి ఇంటి లోపలికి చేరకుండా ఉంటుంది.

ఏంటి భయ్యా.. స్వీట్ షాప్ కు స్వీట్స్ కొనడానికి వచ్చాయా ఏంటి ఎలుకలు(వీడియో)
జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 

అదే సాయంత్రం చల్లని గాలి గదిని చల్లబరుస్తుంది.

Advertisement

వీలైనంతవరకు ఫ్యాన్ ఉపయోగించకుండా ఉండడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.అది సాధ్యపడదు అని అనిపించినప్పుడు ఎయిర్ ఫిల్టర్ లను వాడడం వలన కొంత మంచి ఫలితాలు ఉంటాయి.ఎంత వేడిగా ఉన్నా సరే దుస్తులు లేకుండా మాత్రం నిద్రపోకూడదని నిపుణులు చెబుతున్నారు.

సాధారణ అలర్జీల వల్ల వచ్చేదే హై ఫీవర్. ఇది చాలా సాధారణంగా కనిపించే సమస్య.

ప్రతి ఐదుగురిలో ఒకరు ఈ హై ఫీవర్ బారిన పడుతున్నారు.అందుకే వీలైనంతవరకు ఫ్యాన్ స్పీడులో పెట్టుకోకుండా ఉండడం మంచిది.

తాజా వార్తలు