జ‌లుబుకు నిద్ర‌లేమి కూడా కారణ‌మే.. తెలుసా?

అస‌లే చ‌లి కాలం.ఈ కాలంలో ఎక్కువ శాతం మందిని జ‌లుబు స‌మ‌స్య ఎప్ప‌టిక‌ప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.

అయితే కొంద‌రికి మాత్రం కాలంలో ప‌ని లేకుండా జ‌లుబు బారిన ప‌డుతుంటారు.అందుకు చాలా కార‌ణాలు ఉన్నాయి.

Sleeping Problem Is Also Cause Of Cold! Sleeping Problem, Cold, Latest News, Sle

అయితే చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.నిద్ర‌లేమి కూడా జ‌లుబు రావ‌డానికి ఓ కార‌ణ‌మ‌ట‌.

విన‌డానికి కాస్త న‌మ్మ‌స‌ఖ్యంగా లేక‌పోయినా ఇది నిజ‌మే అంటున్నారు నిపుణులు.మ‌రి ఇంత‌కీ.

Advertisement

జ‌లుబుకు, నిద్రలేమికి లింకేంటీ? అన్న సందేహం ఇప్ప‌టికే మీ మ‌దిలో మొద‌ల‌య్యే ఉంటుంది.ఆ విష‌యాలు ఏంటో ఆల‌స్యం చేయ‌కుండా ఇక్క‌డ చూసేయండి.

నేటి కాలంలో చాలా మందిని నిద్ర‌లేమి స‌మ‌స్య వేధిస్తుంది.ఎంత ప‌డుకుందామ‌న్నా.

నిద్ర ప‌ట్ట‌నే ప‌ట్ట‌దు.ప్ర‌తి రోజు అర్ధరాత్రి వరకు మెలకువ ఉండి ఫోన్లు, టీవీలు చూడ‌టం.

పార్టీలు, ప‌బ్బులు అంటూ బ‌య‌ట తిరగ‌డం, పోష‌కాహారం లోపం ఇలా అనేక కార‌ణాల వ‌ల్ల నిద్ర‌లేమి బారిన ప‌డ‌తారు.ఈ నిద్రలేమి స‌మ‌స్య శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిపై ప్ర‌భావం చూపుతుంది.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

అవును, నిద్ర‌లేమి స‌మ‌స్యను ఎద‌ర్కొంటున్న వారిలో రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌హీన ప‌డిపోతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.ఫ‌లితంగా.

Advertisement

శరీరంలో మనకు తెలియకుండానే వైరస్, బ్యాక్టీరియా చేరి జ‌లుబు, ఫ్లూ వంటి స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తుంది.ఇక నిద్ర‌లేమి కార‌ణంగా మ‌రిన్ని అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా వెంటాడ‌తాయి.

నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న వారిలో మ‌ధుమేహం, గుండె జ‌బ్బులు, బ‌రువు పెర‌గ‌డం, ఒత్తిడి, డిప్రెషన్, గుండె జ‌బ్బులు, మెద‌డు ప‌ని తీరు త‌గ్గ‌డం ఇలా చెప్పుకుంటూ పోతో చాలా స‌మ‌స్య‌లు చుట్టుముడ‌తాయి.కాబ‌ట్టి, నిద్ర‌ను నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌ద‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

నిద్ర స‌మ‌యంలో ఎన్ని ప‌నులు ఉన్నా.రోజుకు క‌నీసం ఏడు నుంచి ఎనిమిది గంట‌లు నిద్రించాల‌ని చెబుతున్నారు.

తాజా వార్తలు