శివ కార్తికేయన్ కొడుకు బారశాల.. వైరల్ అవుతున్న స్టార్ హీరో ఎమోషనల్ పోస్ట్!

కోలీవుడ్‌ స్టార్‌ హీరో శివకార్తికేయన్‌( Sivakarthikeyan ) గురించి మనందరికీ తెలిసిందే.

కోలీవుడ్ లో ఎన్నో సినిమాలలో హీరోగా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.

ఇక ఆయన నటించిన చాలా సినిమాలు తెలుగులో కూడా విడుదలైన విషయం తెలిసిందే.తెలుగులో కూడా శివ కార్తికేయన్ కు బాగానే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.

ఇకపోతే ఇటీవల శివ కార్తికేయన్ దంపతులకు మూడవ బిడ్డ జన్మించిన విషయం తెలిసిందే.ఈ దంపతులకు ఇప్పటికే వీరికి కూతురు ఆరాధన,( Aaradhana ) కుమారుడు గుగన్‌( Gugan ) పుట్టగా మూడోసారి మళ్లీ అబ్బాయే పుట్టాడు.

Sivakarthikeyan Third Child Naming Ceremony Details, Siva Karthikeyan, Sivakarth

తాజాగా అతడికి బారసాల కార్యక్రమం( Naming Ceremony ) నిర్వహించారు.ఈ మేరకు ఒక వీడియో షేర్‌ చేసిన హీరో పిల్లవాడికి పవన్‌( Pavan ) అని నామకరణం చేసినట్లు తెలిపాడు.అలాగే తన భార్య గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు.

Advertisement
Sivakarthikeyan Third Child Naming Ceremony Details, Siva Karthikeyan, Sivakarth

ఈ మేరకు శివ కార్తికేయన్ ట్వీట్ చేస్తూ అందులో ఈ విధంగా రాసుకొచ్చారు.ఆర్తి.

( Aarthy ) ఆపరేషన్‌ థియేటర్‌ లో పిల్లల్ని కనేటప్పుడు నువ్వు ఎంత నరకం చూశావో నేను కళ్లారా చూశాను.ఆ బాధను భరిస్తూ నాకు అందమైన ప్రపంచాన్ని ఇచ్చినందుకు ఎప్పటికీ నీకు కృతజ్ఞుడినై ఉంటాను.

లవ్యూ.అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు.

Sivakarthikeyan Third Child Naming Ceremony Details, Siva Karthikeyan, Sivakarth

చివర్లో ఆరాధన- గుగన్‌ - పవన్‌ అంటూ తన ముగ్గురి పిల్లల పేర్లు ప్రస్తావించాడు.క్షణాల్లోనే ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది.ఇక అందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.

నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ టీ మీరు తాగాల్సిందే!

కాగా హీరో శివకార్తికేయన్‌ 2010లో బంధువుల అమ్మాయి ఆర్తిని పెళ్లి చేసుకున్నాడు.వీరికి 2013లో ఆర్తి, 2021లో గుగన్‌ జన్మించారు.

Advertisement

తాజా వార్తలు