SiriKonda Sona Success Story : భార్యను చదివించిన భర్త.. పిల్లల్ని చదివిస్తూ మూడు ప్రభుత్వ ఉద్యోగాలు.. ఈమె సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!

ఒకవైపు గృహిణిగా ఉంటూనే మరోవైపు ఇంటి బాధ్యతలను చూసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగాలను( Government Jobs ) సాధించడం సులువైన విషయం కాదు.

అయితే అదిలాబాద్ జిల్లా( Adilabad District ) భైంసాకు చెందిన సిరికొండ సోన( SiriKonda Sona ) మాత్రం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి వార్తల్లో నిలిచారు.

ఆమె సక్సెస్ స్టోరీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.సిరికొండ సోనను నెటిజన్లు ఎంతో ప్రశంసిస్తున్నారు.

నిర్మల్ లోని సరస్వతీ శిశుమందిర్ లో సిరికొండ సోన పదో తరగతి వరకు చదువుకున్నారు.ఇంటర్ నిర్మల్ లోనే( Nirmal ) పూర్తి చేసిన ఆమెకు 2010 సంవత్సరంలో వానల్ పాడ్ గ్రామానికి చెందిన గాంధీతో జరిగింది.

ఆ తర్వాత గాంధీ( Gandhi ) తన భార్యను నిర్మల్ లో డిగ్రీ, పీజీ చదివించారు.ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి భర్త ఆమెను ప్రోత్సహిస్తూ వచ్చాడు.

Advertisement

ఒకే సమయంలో 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఆమె సక్సెస్ నెటిజన్లను ఎంతో ఆకట్టుకుంటోంది.

పిల్లలను చదివిస్తూ పోటీ పరీక్షలు( Competitive Exams ) రాసి మూడు ఉద్యోగాలు సాధించిన ఆమె సక్సెస్ స్టోరీ నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.సోనా దంపతులకు ఇద్దరు కొడుకులు కాగా పెద్ద కొడుకు రిశాంత్ ఆరో తరగతి, చిన్న కొడుకు రోహిత్ మోను మూడో తరగతి చదువుతున్నారు.టీజీటీ, పీజీటీ ఉద్యోగ ఖాళీలతో పాటు జేఎల్ ఉద్యోగానికి ఆమె ఎంపిక కావడం గమనార్హం.

డిగ్రీ, పీజీ చదవడానికి భర్త నుంచి ప్రోత్సాహం లభించిందని ఒకేసారి రెండు జాబ్స్ కు ఎంపిక కావడం సంతోషాన్ని కలిగించిందని సోన చెప్పుకొచ్చారు.వచ్చిన ఉద్యోగాలలో జేఎల్ జాబ్ ను ఎంపిక చేసుకుంటానని ఆమె వెల్లడించారు.భర్తతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కు రుణపడి ఉంటానని సోన వెల్లడించారు.

సిరికొండ సోన సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

తన డ్రైవర్ పెళ్లికి హాజరై.. పెళ్ళికొడుకుని కారులో మండపానికి తీసుకొచ్చిన ఎమ్మెల్యే (వీడియో)
Advertisement

తాజా వార్తలు