కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన సింగర్ మంగ్లీ... ఫోటోలు వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్లేబ్యాక్ సింగర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సింగర్ మంగ్లీ ( Singer Mangli ) ఒకరు.

ప్రస్తుతం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా పాటలు పాడుతూ ఎంతో బిజీగా ఉన్నారు మరోవైపు సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తూ ఉన్నారు.

ఇలా పలు కార్యక్రమాలు వరుస ఈవెంట్లు అంటూ కెరియర్ పరంగా మంగ్లీ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇక మంగ్లీ ఒక పాట పాడింది అంటే ఆ పాట కచ్చితంగా సక్సెస్ అవుతుందనే చెప్పాలి.

ఇక ఈమె బాటలోనే తన చెల్లి ఇంద్రావతి చౌహన్ సైతం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సింగర్ గా గుర్తింపు పొందారు.

Singer Mangli House Warming Photos Goes Viral Details,singer,mangli,singer Mangl

ఇలా ఒక మారుమూల పల్లె నుంచి తమ టాలెంట్ బయట పెడుతూ ఇండస్ట్రీలో ఈ స్థాయికి వచ్చి మంగ్లీ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు.ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న మంగ్లీ ఇటీవల కొత్త ఇంటిని ( New House ) కొనుగోలు చేసి గృహప్రవేశ కార్యక్రమాలను కూడా చేసుకున్నారని తెలుస్తోంది.తాజాగా ఈమె గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement
Singer Mangli House Warming Photos Goes Viral Details,Singer,Mangli,Singer Mangl

ఈ గృహప్రవేశ కార్యక్రమంలో భాగంగా బుల్లితెర సెలబ్రిటీలు బిగ్ బాస్ కంటెస్టెంట్ అయినటువంటి రోహిణి ( Rohini ) నటి హిమజ ( Himaja ) హాజరయ్యారు.

Singer Mangli House Warming Photos Goes Viral Details,singer,mangli,singer Mangl

ఇలా మంగ్లీ గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలను రోహిణి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ కావడంతో అభిమానులు మంగ్లీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.అయితే ఇదివరకు ఈమె ఒక ఇంటిని కొనుగోలు చేశారు  తాజాగా మరో ఇంటిని కొనుగోలు చేసి గృహప్రవేశ కార్యక్రమాలను కూడా పూర్తి చేశారని తెలుస్తోంది.

ఇక మంగ్లీ ఇటీవల కాలంలో ఈమె పలు పొలిటికల్ వివాదంలో కూడా నిలిచిన సంగతి తెలిసిందే.

శేఖర్ మాస్టర్ డాన్స్ స్టెప్పులపై పరోక్షంగా వార్నింగ్.. ఏం జరిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు