మోక్షజ్ఞ డెబ్యూ డైరెక్టర్‌ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న బాలయ్య ఫ్యాన్స్‌ అసంతృప్తి

నందమూరి ఫ్యాన్స్‌ గత నాలుగు సంవత్సరాలుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీ వచ్చే ఏడాది ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.

వచ్చే ఏడాది సినిమాను ప్రారంభించి వచ్చే ఏడాదిలోనే సినిమా వచ్చేలా బాలయ్య బాబు ప్లాన్‌ చేస్తున్నాడు.

మోక్షజ్ఞ కోసం పదుల సంఖ్యలో దర్శకులను వందల సంఖ్యలో కథలను పరిశీలించాడని సమాచారం అందుతోంది.ఎంతో మందిని పరిశీలించిన తర్వాత బాలయ్య మనసులోకి సింగీతం శ్రీనివాస్‌ వచ్చాడట.

తనతో ఆధిత్య 369 మరియు భైరవ ద్వీపం అంటూ రెండు అద్బుత చిత్రాలను తెరకెక్కించిన సింగీతం దర్శకత్వంలో తన తనయుడు ఎంట్రీ ఇస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చాడు.ఆధిత్య 369 సీక్వెల్‌ కథ సింగీతం వద్ద చాలా కాలంగా ఉంది.ఆ సినిమాను తీయాలని బాలయ్య కూడా భావించాడు.

అయితే ఆ కథ తనకంటే తన కొడుకు మోక్షజ్ఞకు అయితే బాగుంటుందని, తన సూపర్‌ హిట్‌ మూవీ సీక్వెల్‌తో కొడుకు ఎంట్రీ అవ్వడం వల్ల అదో చరిత్రగా నిలిచే అవకాశం ఉందని కూడా బాలయ్య భావిస్తున్నాడు.

Advertisement

ఒకప్పుడు ఎన్నో అద్బుతాలను ఆవిష్కరించిన సింగీతం అంటే తెలుగు సినిమా పరిశ్రమలో అందరికి గౌరవమే.కాని ప్రస్తుతం ఆయన వయసు మీదపడి ఉన్నాడు.ఇలాంటి సమయంలో ఆయన్ను అద్బుతాలు ఆవిష్కరించమంటే కష్టం అవుతుంది.

అద్బుతాల సంగతం పక్కన పెడితే ఆయన చేస్తే అట్టర్‌ ఫ్లాప్‌ అవుతుందేమోనన్న భయం నందమూరి ఫ్యాన్స్‌లో వ్యక్తం అవుతుంది.ఫ్లాప్‌ అయినా సక్సెస్‌ అయినా మోక్షజ్ఞ మొదటి సినిమా సింగీతం దర్శకత్వంలోనే ఉండాలనేది మరికొందరి కోరిక.

తుది నిర్ణయం మరి కొన్ని నెలల్లో తీసుకునే అవకాశం ఉంది.

అందమైన నలుపు బలమైన జుట్టు కావాలా.. అయితే వారానికి రెండుసార్లు ఇలా చేస్తే చాలు..
Advertisement

తాజా వార్తలు