అధిక ఒత్తిడి నుంచి క్షణాల్లో బయటపడేసే సూపర్ టిప్స్..

ఎప్పుడు బిజీ బిజీ లైఫ్ తో శారీరకంగా మానసికంగా అలిసిపోతుంటారు.పొద్దస్తమానం ఉద్యోగాలు, పనులు, తర్వాత జర్నీలు ఇంట్లోపనులు, ఇలా బాడీ అలిసి పోతే.

ఉద్యోగంలో ఉంటే టెన్షన్లు, ఇంట్లో ఉండే సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఇలా ఏదో ఒక సమస్యతో మానసికంగా అలిసి పోతాం.శారీరకంగా అలసిపోతే.

విశ్రాంతి తీసుకుంటాం.మానసికంగా అలసిపోతే మాత్రం తీసుకోం.

ఎందుకంటే టెన్షన్లతో వచ్చే అలసటను మనం పెద్దగా పట్టించుకోం.కానీ అదే తెలియకుండానే ఎన్నో వ్యాధులు వచ్చేందుకు కారణం అవుతోంది.

Advertisement

మరి మెంటల్ టెన్షన్లు ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం.దేశంలో కరోనా వచ్చినప్పటి నుంచి ప్రజలు రకరకాల టెన్షన్లతో బాధపడుతున్నారు.

ఆర్థిక సమస్యలు, సవాళ్లూ ఎక్కువై.ఒత్తిడి బాగా పెరుగుతోంది.

ఈ ఒత్తిడి అనేది ఒక రకమైన మానసిక సమస్య.ఇది ఎన్నో అనారోగ్యాలకు దారితీస్తుంది.

అలాగే.మనుషుల్ని రోజురోజుకూ కుంగదీస్తూ ఉంటుంది.

మనం చేసే కార్యాలు దిగ్విజయం కావాలంటే ఈ వ్రతం చేయాల్సిందే!

దీన్ని తగ్గించుకోవడానికి మానసిక వేత్తలు 5 చిట్కాలు చెబుతున్నారు.వాటిని పాటిస్తే.

Advertisement

ఒత్తిడిని చాలా వరకూ జయించవచ్చని అంటున్నారు.

వ్యాయామం అనేది.ఒత్తిడిని జయించేందుకు మొదటి అస్త్రంగా చెప్పుకోవచ్చు.వాకింగ్, రన్నింగ్, మెట్లు ఎక్కడం, దిగడం, పిల్లలతో ఆటలు, సైక్లింగ్, పెంపుడు జంతువులతో ఆటలు, ఇలా శరీరాన్ని కదిలించే చిన్న చిన్న ఎక్సర్‌సైజ్‌లు కూడా ఒత్తిడిని జయించేలా చెయ్యగలవు.

ఇలా చేసినప్పుడు బాడీలో ఎండోర్ఫిన్స్ రిలీజ్ అవుతుంది.ఇది పాజిటివ్ ఫీలింగ్స్‌ని పెంచుతుంది.మంచి ఆహారం కూడా టెన్షన్ తగ్గిస్తుంది.

బలమైన ఆహారం.మన మెదడును చురుగ్గా మార్చుతుంది.

శరీరం మొత్తం యాక్టివ్ అవుతుంది.ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి.

అందువల్ల అన్ని రకాల విటమిన్లు, మినరల్స్, పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి.బ్యాలెన్స్డ్ డైట్ వల్ల టెన్షన్ తగ్గుతుంది.

బ్లడ్ షుగర్ లెవెల్స్ క్రమబద్ధీకరించుకుంటూ.ఉంటే.

టెన్షన్ చాలా వరకూ తగ్గుతుంది.

వరుసగా పనులు చేస్తూ ఉన్నా.ఒకే విషయాన్ని పదే పదే ఆలోచిస్తుంటే.టెన్షన్ పెరుగుతుంది.

అందువల్ల దృష్టిని మరల్చుకోవాలి.పనిలో కాస్త బ్రేక్ తీసుకోవాలి.

మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వార్తల్ని మరీ ఎక్కువగా చూడవద్దు.పాజిటివ్ ఆలోచనలు పెంచుకోవాలి.

పజిల్స్ ఆడాలి, బోర్డ్ గేమ్స్ ఆడాలి.సరదాగా ప్రకృతిలో తిరగాలి.ఏదైనా వేరే ప్రాజెక్టును చేపట్టి.

సరదాగా దాన్ని పూర్తి చేస్తూ ఉండాలి.ఓ కొత్త పుస్తకం చదవాలి.

ఇలా నచ్చినది కాసేపు చేయడం ద్వారా.రెగ్యులర్ పని నుంచి బ్రేక్ తీసుకొని టెన్షన్ తగ్గించుకోవచ్చు.

మనం మనుషులం.ఒంటరిగా బతకలేం.

అందువల్ల వీలైనప్పుడల్లా అందరితో కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నించాలి.ఫ్రెండ్స్‌తో మాట్లాడాలి.

అభిప్రాయాలు షేర్ చేసుకోవాలి.సమస్యల్ని చెప్పుకోవడం ద్వారా సాంత్వన లభిస్తుంది.

ఒంటరిగా లేకుండా ప్రకృతిని గమనించాలి.పక్షులు, జంతువులను చూడాలి.

స్వచ్ఛమైన గాలిని పీల్చాలి.ఒకే గదిలో.

చీకటిలో ఉండకూడదు.ఫ్రీ టైమ్ కొంత మిగుల్చుకొని.

కొలీగ్స్‌తో చాటింగ్ చెయ్యాలి.ఇలాంటి పనుల ద్వారా.

మానసికంగా బెటర్ ఫీల్ కలుగుతుంది.

ఒత్తిడికి అనేక కారణాల్లో ఒకటి నిద్ర లేమి.చాలా మంది రోజుకు 5 గంటలు కూడా పడుకోరు.సైకాలజిస్టుల ప్రకారం.

.మనం రోజుకు కనీసం 6 గంటలు పడుకోవాలి.అలాగే.

విశ్రాంతి కూడా తీసుకోవాలి.యంత్రాల్లా పనిచేయడం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది.

మంచి నిద్ర వల్ల శరీరంలో అన్ని అవయవాలూ.తిరిగి ఎనర్జీ లెవెల్స్ పెంచుకుంటాయి.

బ్రెయిన్ బాగా పనిచేసి.పాజిటివ్ ఆలోచనలు పెరుగుతాయి.

ఈ ఐదు సూత్రాలూ పాటించడం ద్వారా.ఒత్తిడిని చాలా వరకూ తగ్గించుకోవచ్చని మానసిక వేత్తలు చెబుతున్నారు.

చూశారుగా ఎలాంటి ఖర్చులేకుండానే ఈజీగా మానసిక స్థితిని, ఒత్తిడిని ఈజీగా జయించేయవచ్చు.

" autoplay>

తాజా వార్తలు