వెల్లుల్లి, ట‌మాటోతో ఇలా చేస్తే ప‌సుపు దంతాలు ముత్యాల్లా మెరుస్తాయి!

ప‌సుపు దంతాలు.మ‌న‌లోని మ‌నోధైర్యాన్ని, మ‌న‌శాంతిని దూరం చేసే స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.

దంతాలు ప‌సుపు రంగులో ఉంటే నాలుగురితో మాట్లాడాల‌న్నా, న‌వ్వాల‌న్నా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు.అస‌లు నోరు తెర‌వ‌డానికి కూడా ఇష్ట‌ప‌డరు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే చింతించ‌కండి.ఎందుకంటే, దంతాల‌ను ముత్యాల్లా మెరిపించుకోవ‌డం పెద్ద కష్టమైన పని ఏం కాదు.

ఇప్పుడు చెప్ప‌బోయే సూప‌ర్ ప‌వ‌ర్ ఫుల్ రెమెడీని ట్రై చేస్తే దంతాలు ఎంత ప‌సుపు రంగులో ఉన్నా ముత్యాల్లా మెర‌వ‌డం ఖాయం.మ‌రి ఇంకెందుకు లేటు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.

Advertisement
Simple And Effective Home Remedy For Yellow Teeth! Simple Remedy, Home Remedy, Y

ముందుగా నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తీసుకుని శుభ్రంగా పొట్టు తొల‌గించాలి.ఇలా పొట్టు తొల‌గించిన వెల్లుల్లి రెబ్బ‌ల‌ను మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.

అలాగే ఒక ట‌మాటోను తీసుకుని స‌గానికి క‌ట్ చేసి.జ్యూస్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, రెండు టేబుల్ స్పూన్ల ట‌మాటో జ్యూస్‌, వ‌న్ టేబుల్ స్పూన్ వైట్ టూత్ పేస్ట్‌, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి అన్ని ప‌దార్థాలు క‌లిసేంత వ‌ర‌కు మిక్స్ చేసుకోవాలి.

Simple And Effective Home Remedy For Yellow Teeth Simple Remedy, Home Remedy, Y

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని బ్ర‌ష్ సాయంతో దంతాల‌కు అప్లై చేసి.రెండు నుంచి మూడు నిమిషాల పాటు సున్నితంగా రుద్దాలి.ఆపై గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రంగా దంతాల‌ను మ‌రియు నోటిని క్లీన్ చేసుకోవాలి.

స‌ర‌స్వ‌తి ఆకు తింటే మేథ‌స్సు పెర‌గ‌డ‌మే కాదు ఈ లాభాలూ పొందొచ్చ‌ని మీకు తెలుసా?

రోజుకు ఒక సారి ఈ విధంగా చేస్తే గార‌ప‌ట్టి ప‌సుపు రంగులోకి మారిన దంతాలు.తెల్ల‌గా, ముత్యాల్లా మెరిసిపోతాయి.సో.ఎల్లో టీత్ తో వ‌ర్రీ అయ్యేవ‌రు ఈ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ హోమ్ రెమెడీని త‌ప్ప‌కుండా ట్రై చేయండి.

Advertisement

తాజా వార్తలు