తలనొప్పి చాతిలో నొప్పి పాదాలు అరిచేతులు చల్లగా అవుతున్నాయా.. అయితే ఈ సమస్య ఉన్నట్లే..

నిస్సత్తువ, అలసట, కళ్ళు తిరగడం, చర్మం పాలినట్టు ఉండడం, ఊపిరి ఆడక పోవడం, జాతిలో నొప్పి, పాదాలు, అరిచేతులు చల్లగా ఉండడం, తలనొప్పి వీటిలో రెండు అంతకంటే ఎక్కువగా లక్షణాలు ఉన్నాయా అయితే ఆ వ్యక్తి అనీమియాతో బాధపడుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు.

ఇది ఎర్ర రక్త కాణాల్లోని ప్రోటీన్.

ఇది కొరియర్ లా పని చేస్తుంది.శరీరంలోని వివిధ కణాలకు ఆక్సిజన్ ను తీసుకొని వెళుతుంది. హిమోగ్లోబిన్ శాతం పురుషులలో 13 నుంచి 16.6 మధ్యలో ఉండాలి.స్త్రీలలో 11.6 నుండి 15 మధ్యలో ఉండాలి.మన దేశంలో సుమారుగా 60 కోట్ల మంది అనీమియాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అంటే తక్కువ హిమోగ్లోబిన్ శాతంతో బాధపడుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.తక్కువ హిమోగ్లోబిన్ కు ప్రధాన కారణం తీసుకునే ఆహారంలో ఇనుము శాతం తక్కువగా ఉండడం.ఇటీవల అయిన దానికి కాని దానికి డయాగ్నొస్టిక్ సెంటర్లకు అనవసరంగా వెళ్లకండి.

మన హిమోగ్లోబిన్ శాతం ఎంత అని ఈ మెసేజ్ ను చదివిన వారు టెస్ట్ లకు పరిగెత్తుతున్నారు.పై లక్షణాలలో ఒకటో రెండో కనిపించిన కనిపించకపోయినా హిమోగ్లోబిన్ తగినంతగా ఉంచుకోడానికి ఈ పద్ధతిని పాటించండి.

Advertisement

ఈ పద్ధతులలో హిమోగ్లోబిన్ పెంచుకోండి.ఒకవేళ మీకు హిమోగ్లోబిన్ ఇదివరకే తగినంత ఉన్న ఇలా చేయడం వల్ల నష్టమేమీ ఉండదు.

మీరు తీసుకునే ఆహారంలో ఇవి ఎక్కువగా ఉండేలా చూసుకోండి.ముఖ్యంగా చెప్పాలంటే పాలకూర, క్యాబేజీ, బీన్స్, పన్నీర్ ప్రతిరోజు ఏదో ఒకటి ఆహారం ఉండేలా చూసుకోవడం మంచిది.ఇక మాంసాహారులకు అనీమియా రావాడం చాలా అరుదు.

ముఖ్యంగా మటన్ కు సంబంధించిన లివర్, కిడ్నీ మొదలైన వాటిలో ఐరన్ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు.ఇంకా చెప్పాలంటే హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నప్పుడు ఆపిల్ పండును తొక్క తీయకుండా తినడం మంచిది.

ఇంకా చెప్పాలంటే ద్రాక్ష పండు, పుచ్చకాయ కూడా ఎంతో మేలు చేస్తాయి. బీట్ రూట్ రసం వేగంగా హిమోగ్లోబిన్ పెరగడానికి ఉపయోగపడుతుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 5, ఆదివారం, జ్యేష్ఠ మాసం , 2022
Advertisement

తాజా వార్తలు