పెరుగు ఆరోగ్యానికి మంచిదే అయినా.. ఆ సమయంలో అస్సలు తినకూడదు తెలుసా?

పెరుగు( curd ).పాల నుండి తయారయ్యే ఉత్పత్తుల్లో ఒకటి.

పెరుగు రుచిగా ఉండడమే కాదు బోలెడన్ని పోషకాలు కలిగి ఉంటుంది.

పెరుగు లేకుంటే భోజనం అసంపూర్ణం.

ఎన్ని కూరలు ఉన్నా సరే చివర్లో పెరుగు తినకుంటే మాత్రం ఏదో వెలితిగా ఉంటుంది.అందుకే పెరుగుతోనే చాలా మంది భోజనాన్ని పూర్తి చేస్తారు.

నిత్యం ఒక కప్పు పెరుగు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.ఎముకలు, దంతాలు, కండరాలకు అవసరమైన కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలు పెరుగు ద్వారా ఈజీగా పొందవచ్చు.

Advertisement

నిత్యం పెరుగు తింటే ఇమ్యూనిటీ సిస్టం( immune system ) బూస్ట్ అవుతుంది.శరీరంలో అధిక వేడి తగ్గుతుంది.గుండెపోటు వచ్చే రిస్క్ తగ్గుతుంది.

అలాగే పెరుగు వల్ల నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

బరువు తగ్గడానికి కూడా పెరుగు ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.రోజుకు ఒక కప్పు పెరుగును తీసుకుంటే ఎక్కువ సమయం పాటు ఆకలి వేయకుండా ఉంటుంది.

చిరు తిండ్లపై మనసు మళ్లకుండా ఉంటుంది.మెటబాలిజం( Metabolism ) రేటు ఇంప్రూవ్ అవుతుంది.

మీరు 11 వ తారీఖున జన్మించారా....అయితే మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?

దీంతో వెయిట్ లాస్ అవుతారు.పెరుగు జుట్టు రాలడాన్ని సైతం అడ్డుకుంటుంది.

Advertisement

అయితే ఆరోగ్యానికి మంచిదే అయినా నైట్ టైమ్ లో మాత్రం పెరుగును తీసుకోకపోవడమే మంచిది అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.సాధారణంగా పెరుగు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.

అందువల్ల రాత్రివేళ పెరుగును తీసుకుంటే జీర్ణ వ్యవస్థపై అధిక ఒత్తిడి పడుతుంది.దీంతో గ్యాస్ ఎసిడిటీ( Gas acidity ) వంటి సమస్యలు తలెత్తుతాయి.

అలాగే రాత్రిపూట పెరుగును తీసుకోవడం వల్ల మ్యూకస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.దీంతో కఫం ఏర్పడి నిద్ర చెడిపోతుంది.ప్రస్తుత వర్షాకాలంలో నైట్ టైమ్ పెరుగును తీసుకుంటే జలుబు, దగ్గు వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి.

ఇక‌ ఆస్తమా సమస్యతో బాధపడుతున్న వారు పెరుగును నైట్ టైం అసలు తీసుకోకూడదు.ఎందుకంటే రాత్రివేళ‌ పెరుగు తింటే ఆస్తమా లక్షణాలను మరింత అధికం అవుతాయి.

తాజా వార్తలు