Hero Siddharth Aditi Rao Hydari : పెళ్లి పీటలెక్కిన హీరో సిద్ధార్థ్..!

సినీ హీరో సిద్ధార్థ్( Hero Siddharth ) పెళ్లి పీటలెక్కారు.

సహా నటి అదితి రావు హైదరి( Aditi Rao Hydari )ని ఆయన వివాహం చేసుకున్నారని తెలుస్తోంది.

వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురం ఆలయంలో వీరి పెళ్లి జరిగింది.ఇరు కుటుంబాలు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి పీటలెక్కారని సమాచారం.

అయితే అదితి రావు, సిద్ధార్థ్ జంటగా డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన మహా సముద్రం సినిమా( Maha Samudram )లో నటించారు.ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది.

ఆ ప్రేమ పెళ్లికి దారి తీసింది.అయితే సిద్ధార్థ్ కు ఇదివరకే వివాహం కాగా కొన్ని మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారని సమాచారం.

Advertisement
జుట్టు రాలకుండా ఉండాలంటే వారానికి రెండు సార్లైనా ఈ ఆయిల్ వాడండి!

తాజా వార్తలు