షాకింగ్ వీడియో: ఇంటి గేట్ మీద పడి చిన్నారి మృతి..

సాధారణంగా చిన్నపిల్లలు ఆడుకునే సమయంలో వారికీ చిన్నచిన్న గాయాలు తగిలించుకోవడం సర్వసాధారణం.

అయితే చిన్నపిల్లలు ఆడుకునే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండేలాగా చూసుకునే బాధ్యత తల్లిదండ్రులదనే చెప్పాలి.

ఇకపోతే., తాజాగా ఒక మూడు సంవత్సరాల చిన్నారి ఆడుకోవడానికి బయటకి వచ్చిన సమయంలో ప్రమాదవశాత్తు ఇనుప గేట్ ఆ చిన్నారిపై పడి మృతి చెందిన సంఘటన పూణే నగరంలోని పింప్రీ చించ్‌ వాడ్‌ బోప్‌ ఖేల్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళ్తే.

Shocking Video: A Child Died After Falling On The Gate Of The House, Viral Video

పూణే నగరం( Pune )లోని పింప్రీ చించ్‌ వాడ్‌ లోని బోప్‌ ఖేల్ ప్రాంతంలో విషాద సంఘటనకు సంబంధించిన సీసీ ఫ్యూటజీ వెలుగులోకి వచ్చింది.ఇక వైరల్ గా మారిన వీడియో మేరకు ఆ చిన్నారి తన స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి ఇంటి బయటకు వచ్చింది.ఈ క్రమంలో ఆ చిన్నారి ఆడుకుంటున్న సమయంలో అక్కడే ఒక అబ్బాయి అపార్టంట్ కు ఉన్న ఇనుప గేటును లాగడం మనం చూడవచ్చు.

Advertisement
Shocking Video: A Child Died After Falling On The Gate Of The House, Viral Video

అయితే ఆ గేటు సరిగ్గా ఉండకపోవడంతో ఒక్కసారిగా ఆ చిన్నారిపై పడింది.దీనితో వెంటనే ఆ చిన్నారితో పాటు ఆడుకుంటున్న స్నేహితులు అందరూ కూడా అమ్మాయి ఇంటికి వెళ్లి వారి తల్లిదండ్రులకు విషయం చెప్పగా.

వెంటనే ఆ చిన్నారి తల్లిదండ్రులు ఘటన స్థలానికి చేరుకొని పాపను హాస్పిటల్ కు తరలించారు.

Shocking Video: A Child Died After Falling On The Gate Of The House, Viral Video

కాకపోతే., హాస్పిటల్( Hospital ) కు చేరుకునే సమయానికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలియజేశారు.ఇక ఆ చిన్నారి మరణంతో ఆ ప్రాంతమంతా శోకసంద్రంలో మునిగిపోయింది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతుంది.ఇక ఈ వీడియోని చూసిన కొంతమంది నెటిజన్స్ పిల్లలు ఇలా ఆడుకుంటున్న సమయంలో పెద్దవారు ఎవరో ఒకరు వారికి తోడుగా ఉండడం మంచిది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా..?! అయితే ఇలా ట్రై చేయండి ఉపశమనం పొందండి..!
Advertisement

తాజా వార్తలు