నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. ఇకపై పాస్‌వర్డ్ వేరొకరికి షేర్ చేయలేరు!

ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ OTT స్ట్రీమింగ్ కి వున్న క్రేజ్ గురించి అందరికీ తెలిసినదే.

కరోనా కష్టకాలంలో జనులు ఇళ్లకే పరిమితైన సమయంలో ఓ వైపు థియేటర్లు కూడా మూత పడటం వలన ఇలాంటి OTTలకు పరిమితమయ్యారు.

ఈ క్రమంలో మనదేశంలోకూడా నెట్‌ఫ్లిక్స్ OTTకి మంచి క్రేజ్ ఏర్పడింది.అయితే రానురాను కరోనా తరువాత థియేటర్లు తెరిచినా కూడా జనాలు OTTకే మొగ్గుచూపుతున్నారు.

అయితే ఇక్కడ ఓ సమస్య అనేది కొన్ని OTT స్ట్రీమింగ్ ప్లేట్ ఫారంలకు ఒకింత సమస్యగా మారింది.అదేమిటంటే, ఒకే యూజర్ ఐడి, పాస్ వర్డ్ లను మల్టిపుల్ పర్సన్స్ వాడటం.

అవును.ఒకే యూజర్ ఐడి, పాస్ వర్డ్ లను మల్టిపుల్ పర్సన్స్ వాడటం వలన సదరు కంపెనీలకు భారీగా నష్టం వస్తుందని వాపోతున్నారు ఆయా OTT ప్లాట్ ఫామ్ లు.ఈ నేపథ్యంలో Netflix ఓ నిర్ణయానికి వచ్చింది.ఇకపై నెట్ ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్ చేస్తే అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని యూజర్లకు హెచ్చరిస్తోంది.

Advertisement

మీ స్నేహితులకు లేదా కుటుంబ సభ్యులకు నెట్ ఫిక్స్ యాక్సస్ చేసుకునేందుకు పాస్‌వర్డ్ షేర్ చేయాల్సి వస్తే మాత్రం తప్పనిసరిగా ఛార్జీలు చెల్లించాలని చెబుతోంది.ఈ కొత్త పాలసీని త్వరలో ప్రారంభించనున్నట్టు నెట్ ఫ్లిక్స్ ఒక ప్రకటనలో తాజాగా వెల్లడించింది.

దీనివల్ల యూజర్లు ఇకనుండి అంత ఈజీగా తమ యూజర్ ఐడి, పాస్ వర్డ్ లను మల్టిపుల్ పర్సన్స్ కి ఇవ్వడమనేది జరగని విషయం.ఎక్కువ మందికి పాస్‌వర్డ్ షేరింగ్‌ను కంట్రోల్ చేయడానికి పెరూ, చిలీ, కోస్టారికాలో ఒక టెస్టింగ్ నిర్వహించింది.కానీ, పాస్‌వర్డ్ షేరింగ్‌ను నిరోధించేందుకు కంపెనీ చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడం కొసమెరుపు.

ఇక తమ పాలసీని ఉల్లంఘించినందుకు అదనపు ఛార్జీలను కూడా చెల్లించాల్సిందిగా నెట్‌ఫ్లిక్స్ యూజర్లను కోరుతోందని నివేదిక వెల్లడించింది.

God Of Coins Player Safety And Responsible Gambling (UK)
Advertisement