త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్ కావడానికి ఆ దర్శకుడు కారణమట.. అలాంటి దర్శకుని కెరీర్ నాశనం చేస్తున్నాడంటూ?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram srinivas ) ఒకరు.20 ఏళ్ల సినీ కెరీర్ లో త్రివిక్రమ్ తక్కువ సినిమాలనే తెరకెక్కించినా ఖలేజా, అజ్ఞాతవాసి మినహా త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన మిగతా సినిమాలన్నీ మంచి లాభాలను అందించాయి.

అయితే అతడు సినిమా వల్లే త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టార్ డైరెక్టర్ అయ్యారనే సంగతి తెలిసిందే.

అయితే త్రివిక్రమ్ కు ఈ ఛాన్స్ దక్కడానికి గుణశేఖర్ కారణమని సమాచారం.మహేష్ గుణశేఖర్ మధ్య మంచి అనుబంధం ఉందనే సంగతి తెలిసిందే.ఈ కాంబినేషన్ లో వచ్చిన ఒక్కడు సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా అర్జున్ సినిమా యావరేజ్ గా నిలిచింది.

వాస్తవానికి దర్శకుడు త్రివిక్రమ్ తొలి సినిమా మహేష్ బాబు హీరోగా తెరకెక్కాల్సి ఉంది.అయితే మహేష్ వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో త్రివిక్రమ్ తొలి సినిమాగా నువ్వే నువ్వే సినిమాను పూర్తి చేసి సక్సెస్ ను అందుకున్నారు.

అయితే తను ఛాన్స్ ఇచ్చినా ఎదురుచూడకుండా త్రివిక్రమ్ ఒక చిన్న సినిమా తీయడం మహేష్ కు నచ్చలేదు.ఈ విషయం గుణశేఖర్ కు తెలిసి మహేష్ త్రివిక్రమ్ మధ్య మనస్పర్ధలను పరిష్కరించి అతడు సినిమా( Athadu ) సెట్స్ పైకి వెళ్లారు.కట్ చేస్తే ప్రస్తుతం గుణశేఖర్ కెరీర్ ను దెబ్బ తీసేలా త్రివిక్రమ్ వ్యవహరిస్తున్నారు.

Advertisement

హిరణ్యకశిప సినిమాకు సంబంధించి గుణశేఖర్ తీసుకున్న లైన్ తో త్రివిక్రమ్ రానాకు హిరణ్యకశిప స్క్రిప్ట్ అందిస్తున్నారని టాక్.

గుణశేఖర్( Gunasekhar ) త్రివిక్రమ్ శ్రీనివాస్ కు సహాయం చేయగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గుణశేఖర్ కు ద్రోహం చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకవైపు డైరెక్టర్ గా మరోవైపు రచయితగా బిజీగా ఉన్నారు.త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం గుంటూరు కారం సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు