ట్రంప్ యంత్రాంగానికి షాక్.. భారతీయ విద్యార్ధికి కోర్టులో ఊరట

అక్రమంగా ఉంటున్న విదేశీయులు, నేరగాళ్లను అమెరికా ప్రభుత్వం( US government ) దేశం నుంచి బహిష్కరిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణలపై ఓ భారతీయ విద్యార్ధిని అక్కడి భద్రతా సంస్థలు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

అలాగే అతనిని దేశం నుంచి బహిష్కరించాలని కూడా ఏర్పాట్లు చేస్తోంది.అయితే ఈ ప్రయత్నాలకు కోర్ట్ బ్రేక్ వేసింది.

వాషింగ్టన్ డీసీలోని జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో( Georgetown University in Washington, DC ) పోస్ట్ డాక్టోరల్‌గా ఉన్న బదర్ ఖాన్ సురి( Badr Khan Suri ) అనే విద్యార్ధి .ఆ విశ్వవిద్యాలయంలో హమాస్‌కు మద్ధతుగా ప్రచారం చేస్తున్నాడని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ అధికారులు ఆరోపించారు.అంతేకాకుండా సదరు మిలిటెంట్ గ్రూప్‌కు చెందిన పలువురితో బదర్ ఖాన్‌కు సంబంధాలున్నాయని చెప్పారు.

ఈ ఆరోపణలపై బదర్ వీసాను రద్దు చేయడంతో పాటు గత సోమవారం అరెస్ట్ చేశారు.

Shock To The Trump Administration.. Indian Student Gets Relief In Court, Us Gove
Advertisement
Shock To The Trump Administration.. Indian Student Gets Relief In Court, US Gove

తన అరెస్ట్‌పై వర్జీనియాలోని ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వర్జీనియా కోర్టును( Eastern District of Virginia Court ) ఆశ్రయించారు బదర్.దీనిపై విచారణ జరిపిన న్యాయయస్థానం తమ తదుపురి ఆదేశాలు వచ్చే వరకు దేశ బహిష్కరణపై స్టే విధించింది.ప్రస్తుతం బాధితుడిని లూసియానాలోని ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్‌లో ఉంచినట్లుగా తెలుస్తోంది.

అయితే అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటున్న వారు తమకు తాముగా దేశం నుంచి బహిష్కరణ చేసుకునేందుకు వీలుగా అధికారులు సీబీపీ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

Shock To The Trump Administration.. Indian Student Gets Relief In Court, Us Gove

ఇలాంటి వారు స్వచ్ఛంగా అమెరికాను వీడినట్లయ్యితే వారికి భవిష్యత్తులో అమెరికా వచ్చేందుకు అవకాశం కల్పిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.

కొద్దిరోజుల క్రితం భారతీయ విద్యార్ధిని రంజనీ శ్రీనివాసన్ ఈ యాప్ ద్వారా అమెరికాను వీడారు.కొలంబియా వర్సిటలో పాలస్తీనాకు అనుకూలంగా జరిగిన నిరసనలకు మద్ధతు తెలిపినందుకు అమెరికా ప్రభుత్వం ఆమె వీసాను రద్దు చేసింది.

ఇదేం వింత శవపేటిక.. స్నికర్స్‌తో బ్రిటిష్ వ్యక్తి అంత్యక్రియలు.. వైరల్ ఫొటో వెనుక అసలు కథ?
న్యూయార్క్‌లోని ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో బీహార్ దివస్

దీంతో అధికారులు బలవంతంగా బహిష్కరించే లోగా తనకు తాను రంజనీ అమెరికాను వీడారు .

Advertisement

తాజా వార్తలు