Shiva Movie Remake : శివ సినిమాను నాగ చైతన్య తో రీమేక్ చేయాలని చూస్తున్నారా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం వారసులు సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటుడు నాగచైతన్య( Actor Naga Chaitanya ).

ఇక ప్రస్తుతం నాగ చైతన్య చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.

అయినప్పటికీ ఈ సినిమాలో నాగచైతన్య పోషించే పాత్ర చాలా కొత్తగా ఉండబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు నాగార్జున రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన శివ సినిమా( Shiva Movie ) భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంది.

అయితే ఈ సినిమాని ఇప్పుడు రీమేక్ చేయాలని కొంతమంది ప్రొడ్యూసర్లు నాగచైతన్య వెంట పడుతున్నట్లుగా తెలుస్తుంది.

Shiva Movie Remake
Advertisement
Shiva Movie Remake-Shiva Movie Remake : శివ సినిమాను న�

అయితే నాగ చైతన్య హీరోగా ఈ సినిమా చేస్తే సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది అనే ఉద్దేశ్యం లో వాళ్లు ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇంకా ఈ రీమేక్ విషయం మీద నాగార్జున( Nagarjuna )ని కూడా సంప్రదించినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.మరి ఈ సినిమా రీమేక్ చేస్తారా ఒకవేళ ఈ సినిమాని రీమేక్ చేస్తే దీనికి దర్శకత్వం ఎవరు వహిస్తారు అనే వార్తలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి.

Shiva Movie Remake

ఇక ఇది ఇలా ఉంటే అక్కినేని అభిమానులు( Akkineni Fans ) మాత్రం నాగచైతన్యతో ఈ సినిమా చేస్తే సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది అంటూ వాళ్లు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.ఇక ఈ సినిమా చూస్తున్న సినీ మేధావులు మాత్రం శివ సినిమాని రీమేక్ చేసి సక్సెస్ కొట్టడం అంటే అంత ఆషామాషీ కాదు నాగచైతన్య కి ఉన్న పొటెన్షియాల్టీకి ఆ సినిమాని సరిగ్గా హ్యాండిల్ చేయగలడా లేదా అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలని సినీ మేధావులు సైతం నాగచైతన్య మీద విమర్శలను చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు