శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ.. డీటెయిల్స్ ఇవే!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో శర్వానంద్( Sharwanand ) ఒకరు.ఈయన తన నటనతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టు కున్నాడు.

శర్వానంద్ ఈ మధ్య మంచి హిట్ అందుకోలేక రేసులో వెనుకబడి పోయిన ఈ మధ్య వచ్చిన తన లాస్ట్ సినిమా ఒకే ఒక జీవితం( Oke Oka Jeevitham movie ) తో మంచి హిట్ అందుకున్నాడు.ఈ సినిమాతో శర్వానంద్ ఎమోషనల్ కు గురి చేసి అందరికి కనెక్ట్ అయ్యాడు.

ఇక ఒకే ఒక జీవితం హిట్ తర్వాత ఈయన తన పంథా మార్చుకుని కొత్తగా కంటెంట్ ఉన్న సినిమాను ఎంచుకున్నాడు.ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా ఒక నవల ఆధారంగా తెరకెక్కుతుంది.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై ఈ సినిమా నిర్మితం అవుతుండగా పెళ్లి కారణంగా గ్యాప్ ఇచ్చాడు.

Advertisement

హఠాత్తుగా ఎంగేజ్మెంట్ చేసుకుని స్వీట్ షాక్ ఇచ్చాడు.శర్వానంద్ రక్షిత( Sharwanand and Rakshitha Reddy ) తో ఎంగేజ్మెంట్ అయ్యింది.తాజాగా పెళ్లి పనులు స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది.

కొద్దిసేపటి క్రితమే శర్వానంద్ పెళ్లి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి అని పెళ్లి కోసం జైపూర్ లోని లీలా ప్యాలెస్ ను అద్భుతంగా డెకరేట్ చేశారు అని తెలుస్తుంది.ఈ వేడుకలు 2 రోజులపాటు అట్టహాసంగా జరగనున్నాయి.

ఈ పెళ్ళికి సినీ స్టార్స్ తో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరవ్వనున్నట్టు తెలుస్తుంది.శర్వానంద్ స్వయంగా వెళ్లి మరీ కొంతమంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించినట్టు టాక్.

ఇక ఈ రోజు మెహందీ, సాయంత్రం సంగీత్ స్టార్ట్ అవ్వనుందట.రేపు రాత్రి 11 గంటల నుండి అసలైన వివాహ వేడుక స్టార్ట్ అవుతుంది.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
సూదిలేని టీకా వచ్చేస్తుంది..... స్వదేశీ తొలి డీఎన్ఏ ఆధారిత టీకా

శర్వానంద్, రక్షిత జంట మరికొద్ది గంటల్లో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు.వీరి లైఫ్ హ్యాపీగా ఉండాలని మనం కూడా కోరుకుందాం.

Advertisement

తాజా వార్తలు