తన అండర్ వేయిర్ కలర్ అడిగిన నెటిజన్ కి షారుఖ్ సూపర్ రిప్లై

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు.

ఎటువంటి సినిమా నేపథ్యం లేకుండా 26 ఏళ్ల వయస్సులో బాలీవుడ్ సినిమా రంగంలోకి ప్రవేశించి ఒక సూపర్ స్టార్ గా ఎదిగిన షారుఖ్ ఖాన్ జీవితం నేటి యువతకు ఎంతో స్పూర్తి దాయకం.అయితే ప్రస్తుతం కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో హీరోలు అభిమానులను కలవడం వీలు పడడం లేదు.అందుకే సోషల్ మీడియా ద్వారా కనెక్ట్ అవుతున్నారు.

తాజాగా దీపికా పదుకొనె కూడా ఇంస్టాగ్రామ్ లో అభిమానుల ప్రశ్నలకు సమాధానమిచ్చింది.అలా చాలా మంది సెలెబ్రెటీలు ఇలా అభిమానులతో టచ్ లో ఉంటున్నారు.

Shah Rukh Khan's Super Reply To A Netizen Who Asked For His Underwear Colour,sha

అయితే తాజాగా షారూఖ్ ఖాన్ తమ అభిమానులతో ముచ్చటించాడు.#ask sharukhkhan పేరిట అభిమానులను వారికి నచ్చిన ప్రశ్నలను అడగమని చెప్పాడు.

అందులో చాలా మంచి మంచి ప్రశ్నలు అడిగారు.ఎంత మంచి దానిలోనైనా చెడగొట్టేవాడు ఒకడు ఉన్నట్టు, షారూఖ్ ఖాన్ ను స్వయంగా ప్రశ్నలు అడిగే అవకాశం వచ్చినపుడు ఏదైనా అతని సినిమాల గురించి కాని తన వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నలు అడిగితే మంచి మంచి సమాధానాలు వస్తాయి.

ఆ సమాధానాలు ఎంతో మందికి ప్రేరణ కలిగిస్థాయి.కాని ఓ అభిమాని షారూఖ్ ఖాన్ ను మీ అండర్ వేయిర్ కలర్ ఏంటి అని అడిగాడు.

ఇక షారూఖ్ ఖాన్ మాత్రం ఏ మాత్రం కోప్పడకుండా ఇటువంటి విద్యావంతుల ప్రశ్నలకు సమాధానమివ్వడానికి కాదు ఇది ఏర్పాటు చేసింది అని చమత్కరిస్తూ సమాధానమిచ్చాడు.ఇక ఆ వ్యక్తిని పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.

తాజా వార్తలు