Canada : కెనడా : వాణిజ్య బోర్డుతో సమావేశం .. ముఖ్య అతిథిగా భారత రాయబారి , ఖలిస్తాన్ మద్ధతుదారుల నిరసన

కెనడాలో ఖలిస్తాన్ ( Khalistan )వేర్పాటువాదుల ఆగడాలు రాను రాను పెచ్చుమీరుతున్నాయి.

ఇప్పటికే ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న భారతీయ దౌత్యవేత్తలు, సిబ్బందితో పాటు ఇతర మతాలకు చెందిన వారిని ఖలిస్తాన్ మద్ధతుదారులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు .

తాజాగా ఒట్టావాలోని భారత హైకమీషనర్ సంజయ్ కుమార్ వర్మ( Sanjay Kumar Verma ) శుక్రవారం సాయంత్రం బ్రిటీష్ కొలంబియాలోని స్థానిక వాణిజ్య బోర్డుతో ‘‘ India and Canada: The Future of our Global Economy Together ’’ పేరిట నిర్వహించిన సమావేశాన్ని నిరసిస్తూ ఆ వేదికను ఖలిస్తాన్ అనుకూల శక్తులు చుట్టుముట్టాయి.గతేడాది జూన్ 18న బ్రిటీష్ కొలంబియా పట్టణంలో ఖలిస్తాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ( Hardeep Singh Nijjar ) హత్య తర్వాత సర్రేకు భారత హైకమీషనర్ రావడం ఇదే తొలిసారి.

నిరసనకారుల ఆందోళనలను లెక్కచేయకుండా ఆయన ఈ సమావేశాన్ని కొనసాగించారు .అనంతరం ఈ ఈవెంట్ విజయవంతమైనట్లుగా సంజయ్ వెల్లడించారు.

అయితే సమావేశం సందర్భంగా ఖలిస్తాన్ మద్ధతుదారులు దౌత్య సిబ్బందిని దుర్భాషలాడటంతో పాటు తిరాంగాను అగౌరవపరిచినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.ఈ కార్యక్రమాన్ని సర్రే బోర్డ్ ఆఫ్ ట్రేడ్ (ఎస్‌బీవోటీ), సౌత్ ఏషియన్ బిజినెస్ అసోసియేషన్ (ఎస్ఏబీఏ) సంయుక్తంగా నిర్వహించాయి.షెరటాన్ గిల్డ్ ఫోర్డ్ హోటల్ ( Sheraton Guildford Hotel )ఆహ్వానం, గుర్తింపు లేకుండా ఎవరూ లోపలికి ప్రవేశించడానికి వీలు లేకుండా స్థానిక లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో లాక్ చేశారు.

Advertisement

ఈవెంట్ ప్రారంభం కావడానికి అరగంటల ముందు దాదాపు 500 మంది నిరసనకారులు హోటల్ వెలుపల గుమిగూడి చుట్టుముట్టి, ప్రవేశాలను అడ్డుకున్నారు.భారతీయ నిఘా వర్గాల నుంచి తప్పించుకునేందుకు వారు ముసుగులు ధరించి, ఖలిస్తాన్ జెండాలు చేతపట్టుకుని వేర్పాటువాద నినాదాలు చేశారు.

నిరసనకారులు ప్రవేశాలను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.సంజయ్ కుమార్ వర్మ అంతకుముందు రోజే సర్రే మేయర్ బ్రెండా లాక్‌తో భేటీ అయ్యారు.వర్మను టార్గెట్ చేస్తామని ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే) పిలుపునిచ్చింది.

ఎస్ఎఫ్‌జే న్యాయవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ( Gurupatwant Singh Pannoon ) .సర్రేను యుద్ధ ప్రాంతంగా అభివర్ణించడంతో పాటు ఖలిస్తాన్ అనుకూల సిక్కులు వర్మను లక్ష్యంగా చేసుకుంటూనే వుంటారని తెలిపారు.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!
Advertisement

తాజా వార్తలు