సీరియల్స్ లో హీరోలు గా చేసే నటుల రెమ్యున్ రేషన్ ఎంతో తెలుసా..?

ఒకపుడు సీరియల్ అంటే చిన్న చూపు ఉండేది.కానీ ఇప్పుడు సినిమా వాళ్ళకి ఏ మాత్రం తగ్గకుండా ప్రస్తుతం ఉన్న సీరియల్ నటులు నటిస్తూ ఆడియెన్స్ ను వాళ్ల నటన తో కట్టిపడేస్తున్నారు.

కొందరు సీరియల్స్ లో ఫేమస్ అయి ఆ తర్వాత సినిమాల్లో కూడా నటిస్తున్నారు.ప్రస్తుతం సినిమాతో పాటు, బుల్లితెర ఇండస్ట్రీ వ్యాప్తి పెరిగింది.నిర్మాణ విలువలు పూర్తిగా మారిపోయాయి.

సోషల్ మీడియాతో సీరియల్స్ కి పాపులారిటీ, ఫ్యాన్ బేస్ పెరిగింది.బుల్లి తెర హీరోలు ఎక్కడికి వెళ్లినా జనాలు గుర్తిస్తున్నారు.

టీవీ ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరోలు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో? వారిలో అంతరికన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న బుల్లితెర హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం.నిరుపమ్ పరిటాలకార్తీకదీపం సీరియల్‌ లో హీరో డాక్టర్ బాబుగా నటించిన నిరుపమ్ పరిటాల( Nirupam Paritala ) ఈ సీరియల్ కి రోజుకి రూ.40 వేల రెమ్యూనరేషన్ తీసుకుంటునట్లు సమాచారం.ప్రస్తుతం నిరుపమ్ పరిటాల రోజుకి రూ.30-40 వేల రెమ్యూనరేషన్ తీసుకుంటు అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా ఉన్నారు.

Serial Actors Remunerations , Nirupam Paritala, Shriram, Prabhakar, Indra Neel,

శ్రీరామ్ప్రేమ ఎంత మధురం సీరియల్‌లో హీరో ఆర్యవర్ధన్‌గా నటిస్తున్న శ్రీరామ్( Shriram ) అత్యధిక పారితోషికం తీసుకునే బుల్లితెర హీరోల్లో ఒకరు.శ్రీరామ్ రోజుకి రూ.40 వేలు పారితోషికం అందుకుంటారని తెలుస్తోంది.శ్రీరామ్ నటుడిగానే కాకుండా నిర్మాతగా పలు సీరియల్స్‌కి ప్రొడ్యూస్ చేశారట.

Serial Actors Remunerations , Nirupam Paritala, Shriram, Prabhakar, Indra Neel,

ప్రభాకర్ఈటీవీ ప్రభాకర్( Prabhakar ) ఒకప్పుడు టెలివిజన్ ఇండస్ట్రీని ఏలిన నటుడు.అతన్ని బుల్లితెర మెగాస్టార్ అని కూడా పిలుస్తారు.

ప్రస్తుతం ఆయన అడపా దడపా నటిస్తున్నప్పటికీ పారితోషికం విషయంలో మాత్రం ప్రస్తుత బుల్లితెర హీరోలతో సమనంగా తీసుకుంటున్నారు.ప్రభాకర్ రోజుకి రూ.35-40 వేలు పారితోషికం అందుకుంటున్నారట.

Serial Actors Remunerations , Nirupam Paritala, Shriram, Prabhakar, Indra Neel,

ఇంద్రనీల్ చక్రవాకం, మొగులిరేకులు లాంటి సూపర్ హిట్ సీరియల్స్‌తో అలరించిన ఇంద్ర నీల్( Indra Neel ).సీరియల్స్ హీరోలకు కూడా ఫ్యాన్ బేస్‌ని తీసుకొచ్చిన నటుడిగా పేరు పొందారు.రీసెంట్‌గా గృహలక్ష్మి సీరియల్‌లో సామ్రాట్‌గా నటించారు.

ఆ సీరియల్ కి రోజుకి రూ 30 వేల పైన పారితోషికం తీసుకుంటునట్లు సమాచారం.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

మానస్ కార్తీకదీపం సీరియల్ ముగిసిన తరువాత అదే సమయంలో బ్రహ్మముడి అనే సీరియల్ మొదలైంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో ఇదే టాప్ టీఆర్పీ రేటింగ్‌లో దూసుకెళ్తోంది.ఇక ఈ సీరియల్‌లో హీరోగా నటిస్తున్న మానస్‌ ( Manas )రెమ్యూనరేషన్ రోజుకు రూ.25 వేలు పారితోషికం తీసుకుంటునట్లు సమాచారం.

వి జే సన్నీకళ్యాణ వైభోగమే సీరియల్‌ హీరోగా నటించి, పాపులర్ అయిన వీజే సన్నీ( VJ Sunny ), ఆ తరువాత బిగ్ బాస్ 5లో విన్నర్ కావడంతో రెమ్యూనరేషన్ రేంజ్ మారిపోయింది.కళ్యాణ వైభోగం సీరియల్ కి రోజుకి రూ.10-15 వేలు పారితోషికం తీసుకున్న సన్నీ, ప్రస్తుతం సినిమాల పైన దృష్టి పెట్టాడు.ఒక వేళ సన్నీ సీరియల్స్ లో నటిస్తే రోజుకి రూ.30-40 వేలు తీసుకోవచ్చని తెలుస్తోంది.

తాజా వార్తలు