అంగన్ వాడీలు సంచలన నిర్ణయం రేపటి నుంచి ఎమ్మెల్యేల ఇళ్ళ వద్ద నిరసనలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో( Andhra Pradesh ) గత రెండు వారాల నుండి అంగన్ వాడీ హెల్పర్లు, వర్కర్లు ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే.

వేతనాలు పెంచాలని గత 15 రోజుల నుండి నిరసనలు చేపడుతున్నారు.

ఈ క్రమంలో ప్రభుత్వం నుండి సరైన స్పందన రాకపోవడంతో మండిపడుతున్నారు.మంత్రి బొత్స( Botsa Satyanarayana ) అదేవిధంగా అధికార బృందంతో నేడు సాయంత్రం జరిపిన చర్చలు విఫలమయ్యాయి.

ప్రభుత్వం నుండి సరైన స్పందన రాకపోవడంతో యూనియన్ నేతలు మండిపడ్డారు.దీంతో రేపటి నుంచి ఎమ్మెల్యేల ఇళ్ళ వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని యూనియన్ సంఘాల నాయకులు డిసైడ్ అయ్యారు.

ఆ తరువాత జనవరి మొదటి వారంలో కలెక్టరేట్ లను( Collectorate ) ముట్టడిస్తామని తెలిపారు.

Sensational Decision Of Anganwadis Protest At Mlas Houses From Tomorrow Details,
Advertisement
Sensational Decision Of Anganwadis Protest At MLAs Houses From Tomorrow Details,

ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వంతో అంగన్ వాడీ యూనియన్ సంఘాలు( Anganwadi Union ) నాలుగు సార్లు చర్చలు జరిపాయి.మరోపక్క అంగన్ వాడీలు నిరసనలతో బాలింతలు మరియు గర్భిణీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు.ఈ క్రమంలో వెంటనే విధులలో చేరాలని రాష్ట్ర ప్రభుత్వం( AP Govt ) తెలియజేస్తూ ఉంది.

అయితే జీతాల పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని యూనియన్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ఈ క్రమంలో వేతనాల పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో యూనియన్ సంఘాలు.

సమ్మె మరింతగా ఉధృతం చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది.

వామ్మో.. ఇంగువతో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా?
Advertisement

తాజా వార్తలు