మైనారిటీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో భారతరత్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాలు జరిగాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.

మైనారిటీలకు వైసీపీ ప్రభుత్వం పెద్దపేట వేసిందని తెలిపారు.భారతరత్న మౌలానా అబ్దుల్ కలాం దేశానికి చేసిన సేవలను కొనియాడారు.2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన తండ్రి అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి.మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ పుట్టినరోజుని మైనారిటీ వెల్ఫేర్ డే నేషనల్ ఎడ్యుకేషన్ డేగా ప్రకటించినట్లు గుర్తు చేశారు.

దేశంలో మొట్టమొదటిసారి ముస్లింలకు రిజర్వేషన్ లు కల్పించిన ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అని చెప్పడానికి సంతోషపడుతున్నట్లు పేర్కొన్నారు.

Sensational Comments Of Cm Jagan On The Occasion Of Minority Welfare Day Ysrcp,

మైనారిటీల సంక్షేమం పట్ల తండ్రి వైయస్సార్ ఒక్క అడుగు వేస్తే ఆయన బిడ్డగా తాను రెండడుగులు వేసినట్లు చెప్పుకొచ్చారు.రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి అన్ని రంగాలలో ముస్లింలకు పెద్దపీట వేసినట్లు సీఎం జగన్ స్పీచ్ ఇచ్చారు.అనంతరం ట్విట్టర్ లో సంచలన ట్విట్ చేశారు.

Advertisement
Sensational Comments Of CM Jagan On The Occasion Of Minority Welfare Day YSRCP,

"భార‌తదేశ‌ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ క‌లాం ఆజాద్ గారి జ‌యంతి సంద‌ర్భంగా నేడు మ‌న ప్ర‌భుత్వంలో మైనారిటీస్ వెల్ఫేర్ డే, నేష‌న‌ల్ ఎడ్యుకేష‌న్ డేల‌ను నిర్వ‌హించాం.దేశ చ‌రిత్ర‌లో తొలిసారిగా ముస్లింల‌కు రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేసిన వ్య‌క్తి మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి గారు.

మైనార్టీల సంక్షేమం కోసం ఆయ‌న ఒక అడుగు వేస్తే ఆయ‌న త‌న‌యుడిగా నేను రెండడుగులు వేశాను.మ‌న ప్ర‌భుత్వంలో ముస్లిం సోద‌ర, సోద‌రీమ‌ణుల‌కు సంక్షేమం నుంచి కీల‌క ప‌దవుల్లో స్థానం క‌ల్పించ‌డం వ‌ర‌కూ అన్ని రంగాల్లోనూ పెద్ద పీట వేశాం.

ప‌లు అంశాల్లో ముస్లింల సాధికార‌త విష‌యంలో మ‌న ప్ర‌భుత్వంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయ‌ని చెప్పేందుకు గ‌ర్వ‌ప‌డుతున్నాను" అని ట్వీట్ చేయడం జరిగింది.

స‌మ్మ‌ర్‌లో రోజుకో గ్లాస్ ల‌స్సీ తాగితే..మ‌స్త్‌ బెనిఫిట్స్‌!
Advertisement

తాజా వార్తలు