దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్, రష్మిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సీతారామం సినిమా థియేటర్లలో విడుదలై ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో ప్రదర్శితమవుతోంది.
తొలిరోజు ఈ సినిమాకు పరవాలేదనే స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి.
దుల్కర్ సల్మాన్ కు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా గుర్తింపు లేకపోవడం ఈ సినిమాకు ఇక్కడ కలెక్షన్ల విషయంలో కొంతవరకు మైనస్ అయింది.తమిళ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ కావడం సీతారామం సినిమాకు ఒక విధంగా ప్లస్ అయింది.ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ల విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 3.05 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.45 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు 20 కోట్ల రూపాయల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది.నైజాంలో ఈ సినిమా 54 లక్షల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోగా సీడెడ్ లో ఈ సినిమాకు 16 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.
ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు 21 లక్షల రుపాయల కలెక్షన్లు రావడం గమనార్హం.గోదావరి జిల్లాలలో ఈ సినిమా 23 లక్షల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది. కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఈ సినిమాకు 28 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.
నెల్లూరులో ఈ సినిమాకు 8 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.ఇతర ప్రాంతాల్లో ఈ సినిమా 15 లక్షల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది.
ఈ సినిమా సక్సెస్ తో రష్మిక మరోసారి గోల్డెన్ లెగ్ అని ప్రూవ్ చేసుకుంది.
బింబిసార, సీతారామం సినిమాల విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మరిన్ని కంటెంట్ ఉన్న కథలు తెరకెక్కే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమా కలెక్షన్లు ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది.సీతారామం సక్సెస్ చిత్రయూనిట్ కు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy