శనగపంట సాగులో విత్తన శుద్ధి.. ఎరువుల యజమాన్యం..!

ప్రధానమైన పప్పుధాన్యాల పంటలలో శనగ పంట(sanaga cultivation) ముఖ్యమైనది.మిగతా పంటలతో పోలిస్తే శనగ పంట తక్కువ శ్రమతో కూడుకున్నది.

ఈ శనగ పంటకు నల్లరేగడి నేలలు(Alluvial soils) చాలా అనుకూలంగా ఉంటాయి.వేసవిలో రెండు లేదా మూడుసార్లు లోతుగా నేలను దుక్కి దున్నాలి.

తొలకరి చినుకులు పడ్డాక గొర్రుతో నేలను చదును చేయాలి.శనగను శీతాకాల పంటగా చెప్పుకోవచ్చు.

శీతాకాలంలోని మంచుతో మొక్కలు బాగా పెరుగుతాయి.పంటకు ముందే దుక్కిలో ఎరువులు వేయాలి.

Advertisement

ఒక ఎకరం నల్లరేగడి నేలకు 20 కిలోల భాస్వరం, 18 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 15 కిలోల గంధకం ఎరువులను వేయాలి.

ఇక మేలు రకం విత్తనాల విషయానికి వస్తే భారతి, క్రాంతి, జెజి 11, జెజి 130, జెజికె 1, కెఎకె 2 ఇలాంటి మేలు రకం విత్తనాలను ఎంచుకోవాలి.తరువాత విత్తన శుద్ధి చేసే విధానం గురించి అవగాహన ఉంచుకోవాలి.ఒక కిలో విత్తనాలకు 2.5 గ్రా థైరమ్ లేదా కాప్టాన్ తో విత్తన శుద్ధి చేయాలి.తర్వాత విత్తనాలను నేలలో ఒక అంగుళం దూరం ఉండేలాగా విత్తుకుంటే సూర్యరశ్మి, గాలి బాగా తగిలి మంచులో కొమ్మలు విపరీతంగా పెరిగి పంట దిగుబడి పెరుగుతుంది.

అలాగే విత్తుతున్న సమయంలో నీటిలో కరిగే గంధకాన్ని వేస్తే దిగుబడి పెరిగే అవకాశం ఉంది.నేలలో ఐరన్ ధాతు లోపం ఉన్నట్లయితే లీటర్ నీటిలో ఒక గ్రాము నిమ్మ ఉప్పు(Lemon salt) కలిపి మొదటి వారంలో రెండుసార్లు పిచికారి చేయాలి.

శనగ పంట కు నీటి అవసరం చాలా తక్కువ.దీనిని వర్షాధారపు పంటగా పరిగణిస్తారు.పంట పూతకు రాకముందు తక్కువ క్రమంలో ఒకసారి నీటిని పారించి, నీటిని పొలంలో నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి.

Amerio Erfahrungen Und Reputation : Eine Analytische Einordnung
Fun Bet Erfahrungen Und Reputation (DE) : Ein Praktischer Leitfaden

పంట వేశాక 45 రోజుల వరకు పొలంలో కలుపు లేకుండా ఎప్పటికప్పుడు తొలగించుతూ ఉండాలి.ఒకవేళ పూత, పిందెల దశలో పురుగులు ఆశించినట్లయితే ఫ్లుక్లోరాలిన్ ను నీటితో కలిపి మొక్క ఆకులు బాగా తడిచేలాగా పిచికారి చేయాలి.

Advertisement

తాజా వార్తలు