ఈ పిల్లి యజమానిని ఎలా కాపాడుతుందో చూస్తే ఫిదా అవుతారు...

కుక్కలు మాత్రమే కాదు పిల్లులు( Cats ) కూడా యజమానుల పట్ల చాలా విధేయంగా, విశ్వసనీయంగా ఉంటాయి.ఓనర్లకు హాని కలగకుండా ఇవి ప్రొటెక్ట్ చేస్తాయి.

ఇప్పటికీ కొన్ని హీరో క్యాట్స్ తమకు ఫుడ్ పెట్టే వారిని కాపాడి వారి రుణం తీర్చుకున్నాయి.తాజాగా ఇలాంటి లాయల్ క్యాట్ కు( Loyal Cat ) సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ అయింది.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక తెల్ల పిల్లి, ఒక నల్ల పిల్లి బెడ్ పై పడుకోవడం మనం చూడవచ్చు.యజమాని( Owner ) తెల్ల పిల్లిపై చేయి పెట్టి నిమురుతూ ఉన్నాడు.నల్ల పిల్లి దీనిని చూస్తూ ఉంది.

అయితే యజమాని తెల్ల పిల్లి మెడకు సమీపంలో తన చేయిని పెట్టి రుద్దడం స్టార్ట్ చేశాడు.దీంతో ఇరిటేట్ అయిన ఆ వైట్ క్యాట్( White Cat ) యజమాని చెయ్యి కొరికింది.

Advertisement

ఇది గమనించిన నల్ల పిల్లి( Black Cat ) వెంటనే తన పంజాతో వైట్ క్యాట్ ముఖం మీద ఒక పంచ్ ఇచ్చింది.ఆ తర్వాత గట్టిగా అరుస్తూ యజమానిని మళ్లీ కొరికితే నీ పని ఖతం అన్నట్లు చూసింది.

దాంతో వైట్ క్యాట్ చాలా భయపడిపోయి అలానే స్టన్ అయిపోయింది.

@ShouldHaveCat ట్విట్టర్ పేజీ దీనికి సంబంధించిన వీడియోను పంచుకుంది.ఒక్కరోజు క్రితమే షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికీ 37 లక్షల దాకా వ్యూస్ వచ్చాయి.ఈ వీడియో పై రకరకాల కామెంట్లు వచ్చాయి.

ఇది కుక్క కంటే విశ్వాసంగా ఉందని వీడియో చూసిన ఒక నెటిజెన్ కామెంట్ చేశాడు.ఆహారం పెట్టే చేతిని కొరకొద్దని ఇది తన తోటి పిల్లికి చెబుతున్నట్లు మరొకరు వ్యాఖ్యానించారు.

Cool Bet Im Überblick : Wie Die Marke Funktioniert Und Was Spieler Wissen Sollten
Bets 10 Bonuses And Promotions : A Practical Welcome Bonus Breakdown

ఇదొక బాడీ గార్డ్ క్యాట్ అని, ఇలాంటి పిల్లి తమకు కూడా కావాలని ఇంకొకరు అన్నారు.ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Advertisement

తాజా వార్తలు