ఎస్సీ వర్గీకరణ బిల్లు చర్చకు రాలేదు..: ఎంపీ కనకమేడల

పార్లమెంటరీ లైబ్రరీ భవనంలో ఏర్పాటైన కేంద్ర అఖిలపక్ష భేటీలో ఏపీ టీడీపీ ఎంపీ కనకమేడల పాల్గొన్నారు.కొత్త బిల్లుల గురించి కేంద్రం వివరించిందని పేర్కొన్నారు.

ఎస్సీ వర్గీకరణ బిల్లు చర్చకు రాలేదని ఎంపీ కనకమేడల తెలిపారు.విభజన హామీల అమలుపై ప్రస్తావించానన్న కనకమేడల పోలవరం ప్రాజెక్టుపై దృష్టి సారించాలని కోరానని వెల్లడించారు.

SC Classification Bill Not Discussed..: MP Kanakamedala-ఎస్సీ వర�

ఏపీ రాజధాని అంశాన్ని కూడా ప్రస్తావించానన్న కనకమేడల వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలను ఎత్తిచూపానని తెలిపారు.ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారాన్ని అఖిలపక్షం దృష్టికి తీసుకెళ్లానన్న ఎంపీ కనకమేడల ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణపై పార్లమెంట్ లో చర్చించాలని కోరినట్లు తెలిపారు.

అయితే సాగర్ డ్యామ్ వ్యవహారం అనుమానాలకు తావిస్తోందని వ్యాఖ్యానించారు.

Advertisement
పురుషుల్లో అధిక హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టే ఎఫెక్టివ్ రెమెడీ ఇదే!

తాజా వార్తలు