క్యూఆర్ కోడ్ విషయంలో జరా జాగ్రత్త సుమీ.. లేదంటే మీ డబ్బులు అంతే..!

ఈ మధ్య కాలంలో ఆన్లైన్ మోసాలు బాగా ఎక్కువ అయిపోతున్నాయి.అలాగే ఎవరు చూసినగాని ఆన్ లైన్ ట్రాన్సక్షన్స్ చేస్తున్నారు.

ఆన్‌లైన్‌ లో చెల్లింపులు చేయడం చాలా ఈజీగానే ఉంటుంది.అలాగే ఆన్లైన్ లో డబ్బులు బదిలీ చేసే క్రమంలో కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కోవలిసి వస్తుంది.

ఎందుకంటే ఆన్‌లైన్ పేమెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి.లేదంటే హ్యాకర్లు మీ బ్యాంకు బాలన్స్ ను ఖాళీ చెయ్యడం ఖాయం.

అయితే ఈ మధ్య కాలంలో షాపింగ్ మాల్ దగ్గర నుండి చిన్న సైజ్ కిరాణా షాపు వరకు ప్రతి ఒక్కరు క్యూఆర్ కోడ్‌ లను ఉపయోగిస్తున్నారు.వాటిని స్కాన్ చేయడం ద్వారా డబ్బులను వాళ్ళ ఖాతాలోకి బదిలీ చేస్తున్నారు.

Advertisement

అయితే ఇకమీదట మీరు క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేసేముందు చాలా అప్రమత్తంగా ఉండాలని దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన ఎస్‌బీఐ బ్యాంకు సూచన జారీ చేసింది.ఒకవేళ మీరు కనుక డబ్బులు పొందడం కోసం క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసినట్లయితే చిక్కుల్లో పడినట్లే అని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తమ కస్టమర్స్ ను అలెర్ట్ చేసింది.

ఎందుకంటే కేవలం క్యూఆర్ కోడ్ తో డబ్బులు మాత్రమే చెల్లిస్తామని, డబ్బులు పొందడానికి కాదని తేల్చి చెప్పేసింది.క్యూఆర్ కోడ్‌ అనేది ఒక క్విక్ రెస్పాన్స్ కోడ్ మాత్రమే.షాప్స్ లో మొబైల్ పేమెంట్లను చేసుకునేందుకు దీనిని ఉపయోగించడం జరుగుతుంది.

క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి, ఎవరో తెలియని, ధ్రువీకరణ లేని క్యూఆర్ కోడ్‌లను ఎట్టి పరిస్థితులలో స్కాన్ చెయ్యద్దని స్టేట్ బ్యాంక్ అంటోంది.మరి రూపాయి, రెండు రూపాయిలకు కూడా ఈ మధ్య క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేస్తున్నారు.

అలా చేయడం సరికాదని పేమెంట్ చేసేటప్పుడు, స్కాన్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించి చేయండి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 8, బుధవారం 2023
Advertisement

తాజా వార్తలు