వాట్సాప్ ద్వారా ఎస్‌బీఐ బ్యాంకింగ్ సేవలు

ప్రస్తుతం మన జీవితంలో వాట్సాప్ వినియోగం ఓ విడదీయరాని భాగమై పోయింది.దీంతో పలు సేవలు వాట్సాప్ ద్వారానే కొనసాగుతున్నాయి.

ఈ తరుణంలో భారతదేశపు అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది.త్వరలో వాట్సాప్ ద్వారా బ్యాంకింగ్ సేవలను అందించనుంది.

వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రకటన వెలువడింది.బ్యాంక్ నుంచి అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్(API)ని త్వరలో ప్రారంభించనుంది.

దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.ప్రస్తుతం అందరి వద్దా స్మార్ట్‌ఫోన్లు ఉంటున్నాయి.

Advertisement

తక్కువ చదువుకున్నవారు, నిరక్షరాశ్యులు కూడా వాట్సాప్ సేవలను చక్కగా వినియోగించుకుంటున్నారు.అందరి జీవితాల్లో వాట్సాప్ అంతర్భాగంగా మారింది.

దీంతో ఎస్‌బీఐ ఉన్నతాధికారులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.బ్యాంకింగ్ సేవలను వాట్సాప్ అందించాలనే నిర్ణయానికి వచ్చారు.

బ్యాంకు, కస్టమర్లకు మధ్య సంబంధాలను మెరుగుపర్చడానికి, మరిన్ని సేవలను అందించడానికి వాట్సాప్‌ను సాధనంగా వినియోగించుకోనున్నారు.అయితే కస్టమర్ల సమాచారం సర్వర్‌లలో సురక్షితంగా ఉంచబడుతుందని తెలుస్తోంది.

ఎస్‌బీఐ వాట్సాప్ సర్వీస్ ద్వారా ఎలాంటి సేవలు అందిస్తారనే వివరాలను బ్యాంకు ఇంకా వెల్లడించలేదు.విశ్వసనీయ సమాచారం మేరకు క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లకు ముందుగా వాట్సాప్ ఆధారిత సేవను అందనున్నట్లు ప్రచారం సాగుతోంది.

చనిపోయిన వారిని కొన్ని నిమిషాలు బ్రతికించే ఆలయం ఇదే.. ఎలా పూజించాలంటే?

వారు వాట్సాప్ ద్వారా తమ ఖాతాలోని బ్యాలెన్స్, రివార్డ్ పాయింట్లు, కార్డ్ చెల్లింపులు, మరిన్ని వివరాలను తనిఖీ చేయవచ్చు.ఇందుకోసం వాట్సాప్‌లో OPTIN అని టైప్ చేసి, 9004022022 నంబరుకు పంపించాలి.

Advertisement

లేకుంటే మీరు బ్యాంకులో నమోదు చేసిన నంబరు నుంచి 08080945040కి మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.టెక్స్ట్ మెసేజ్ మీ బ్యాంక్‌లోని రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి మాత్రమే చేయాల్సి ఉంటుంది.ఆ తర్వాత బ్యాంకింగ్ సేవలు వినియోగించుకోవచ్చు.

తాజా వార్తలు