ఈ బనానా మాస్క్ తో మొటిమలకు చెప్పండి గుడ్ బై..!

సాధారణంగా కొందరికి ముఖం మొత్తం మొటిమలతో నిండిపోతూ ఉంటుంది.దాంతో ముఖాన్ని అద్దంలో చూసుకోవడానికి కూడా సంకోచిస్తుంటారు.

మొటిమలు అందాన్ని పాడు చేయ‌డ‌మే కాకుండా మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురిచేస్తాయి.ఈ క్రమంలోనే మొటిమలను వదిలించుకునేందుకు తెగ ప్రయత్నిస్తూ ఉంటారు.

అలాంటివారికి ఇప్పుడు చెప్పబోయే బనానా మాస్క్ సూపర్ గా సహాయపడుతుంది.ఈ బనానా మాస్క్ తో మొటిమలకు గుడ్ బై చెప్పవచ్చు.

మరి ఇంతకీ ఆ మాస్క్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా బాగా పండిన అరటి పండును( Banana fruit ) తీసుకుని పీల్ తొలగించి స్లైసెస్ గా కట్ చేసుకోవాలి.

Advertisement

ఆ తర్వాత మిక్సీ జార్ లో కట్ చేసి పెట్టుకున్న బనానా స్లైసెస్ వేసి వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ ( Rose water )పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ బనానా ప్యూరీలో వన్ టీ స్పూన్ బ్రౌన్ షుగర్ పౌడర్( Sugar powder ), వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి కొంచెం మందంగా అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని సున్నితంగా రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

రెండు రోజులకు ఒకసారి ఈ బనానా ఫేస్ మాస్క్ ను కనుక వేసుకున్నారంటే అదిరిపోయే బ్యూటీ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.ముఖ్యంగా ఈ మాస్క్ మొటిమలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది.

చర్మంపై అధిక ఆయిల్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.కొద్దిరోజుల్లోనే మొటిమల్లేని చర్మాన్ని మీ సొంతం చేస్తుంది.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

అంతేకాకుండా ఈ బనానా మాస్క్ చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది.డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది.స్కిన్ హెల్త్ ని మెరుగుపరుస్తుంది.

Advertisement

స్కిన్ సాఫ్ట్ అండ్ షైనీ గా మెరిసేలా ప్రోత్స‌హిస్తుంది.అంతేకాకుండా ఈ బనానా మాస్క్ చర్మం త్వరగా ముడతలు పడకుండా కాపాడుతుంది.

ఎండ వల్ల కమిలిపోయిన చర్మాన్ని రిపేర్ చేయడంలో కూడా ఈ మాస్క్ సూపర్ గా సహాయపడుతుంది.

తాజా వార్తలు