కాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పిన జబర్దస్త్ సత్య శ్రీ... ఎన్నో అవమానాలు పడ్డానంటూ కామెంట్స్?

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది లేడీ కమెడియన్స్ కూడా పరిచయమయ్యారు.

ఈ కార్యక్రమం మొదట్లో లేడీ గెటప్స్ కూడా మగవారే వేసేవారు అయితే రాను రాను ఈ కార్యక్రమంలో లేడీ కమెడియన్స్ కి కూడా అవకాశాలు కల్పించారు.

ఈ క్రమంలోనే చమ్మక్ చంద్ర టీమ్ ద్వారా అందరికీ పరిచయమయ్యారు నటి సత్య శ్రీ. ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి రాకముందు పలు బుల్లితెర సీరియల్స్ లోను అలాగే పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు.

అయితే ఎన్నో సినిమాలు సీరియల్స్ లో నటించిన రాని గుర్తింపు జబర్దస్త్ కార్యక్రమం ద్వారా వచ్చింది.జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సత్య శ్రీ చమక్ చంద్ర ఈ కార్యక్రమం నుంచి వెళ్లిపోవడంతో తాను కూడా వెళ్ళిపోయానని చెప్పారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సత్య శ్రీ మాట్లాడుతూ తాను అవకాశాల కోసం ఇండస్ట్రీ చుట్టూ తిరిగినప్పుడు కెరియర్ మొదట్లో ఎన్నో అవమానాలు పడ్డారని వెల్లడించారు.కొందరైతే నీ మొహానికి యాక్టింగ్ కూడా వచ్చా అంటూ అవమానపరిచారని సత్య శ్రీ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.

Advertisement
Satya Sri Comments On Casting Couch Full Details Inside Details, Satya Sri, Jaba

అయితే ఇలా అవమానించినప్పుడు తాను కృంగిపోలేదని ఆ అవమానాలను పాజిటివ్ గా తీసుకొని అవకాశాల కోసం ప్రయత్నించానని తెలిపారు.

Satya Sri Comments On Casting Couch Full Details Inside Details, Satya Sri, Jaba

ఇకపోతే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొంటారనే విషయం అందరికి తెలిసిందే.అయితే తనకి ఎప్పుడు అలాంటి పరిస్థితులు ఎదురు కాలేదని ఈ సందర్భంగా సత్య శ్రీ వెల్లడించారు.తన తల్లి ఇండస్ట్రీలోనే ఉండడం అలాగే తన అమ్మమ్మ రాజకీయాలలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడంతో తన వరకు క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎప్పుడు రాలేదని సత్య శ్రీ వెల్లడించారు.

ఇక జబర్దస్త్ నుంచి తన గురువుగారు చమ్మక్ చంద్ర వెళ్ళిపోవడంతో తాను వెళ్లిపోయానని అయితే తిరిగి జబర్దస్త్ కార్యక్రమంలో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని ఈ సందర్భంగా సత్య శ్రీ వెల్లడించారు.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు
Advertisement

తాజా వార్తలు