దరిద్రపు నా డాష్ అంటూ తిట్టాడు.. ఆ నిజాన్ని బయట పెట్టిన సత్య ప్రకాష్?

సత్య ప్రకాష్.తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో విలక్షణమైన పాత్రల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

ఇక తనదైన విలనిజంతో ప్రేక్షకులను ఎన్నో సినిమాల్లో భయపెట్టాడు.దర్శకుడిగా కూడా పలు సినిమాల్లో తన సత్తా చాటాడు.

ఆగండాగండి.మీరు చెప్పే ఇంట్రడక్షన్ బాగానే ఉంది కానీ ఇంతకీ ఈ సత్యప్రకాష్ ఎవరు మాకు అస్సలు తెలియదు అని అనుకుంటున్నారు కదా.సత్య ప్రకాష్ అంటే ఎవరో కాదు సైకో సత్య.

Sathya Prakash Unknown Facts , Sathya Prakash , Director , Actor , Psycho Sathya

ఓ ఆయన.ఆయన మాకు తెలుసుగా అని అంటారా.ఇక వార్తల్లోకి వెళ్తే చాలామందికి సత్య ప్రకాష్ పేరు తెలియదు.

Advertisement
Sathya Prakash Unknown Facts , Sathya Prakash , Director , Actor , Psycho Sathya

కానీ ఆయన నటించే పాత్ర ద్వారా సైకో సత్య గానే ప్రత్యేక ముద్ర వేసుకున్నారు.కేవలం విలన్ గా మాత్రమే కాదు కమెడియన్గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు.

సుమారు ఐదు వందల అరవై సినిమాల్లో నటించి చిత్ర పరిశ్రమలో ఎనలేని గుర్తింపును సంపాదించుకున్నారు.ఇటీవలకాలంలో సైకో సత్యకు అటు ఇండస్ట్రీ లో అవకాశాలు లేక పూర్తిగా కనుమరుగైపోయారు.

కానీ ఒకప్పుడు మాత్రం ఏ సినిమాలో చూసినా సైకో విలన్ పాత్రలో కనిపిస్తూ ప్రేక్షకులను భయపెట్టారు ఆయన.

Sathya Prakash Unknown Facts , Sathya Prakash , Director , Actor , Psycho Sathya

ఇకపోతే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సైకో సత్య తన కెరీర్ విశేషాలను పంచుకున్నారు.తన కెరీర్లో ఎదురైన అనుభవాలను కూడా చెప్పుకొచ్చారు.దర్శకుడిని అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చ.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 23 బుధవారం, 2020

కానీ దేవుడు నన్ను నటుడిని చేశాడు. విజయనగరంలో పుట్టిన ఒడిశాలో పెరిగా.

Advertisement

ఒకానొక సమయంలో బ్యాంకులో కూడా పని చేసా.ఇక డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి దగ్గర పని చేద్దాం అనుకుని వెళ్తే చివరికి నన్ను విలన్ పాత్ర చేయించారు.

ఆ తర్వాత మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ కూడా నటిస్తే బాగుంటుందని సూచించాడు.అప్పటికే తనకు ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో నటుడిగా కొనసాగాను.560 సినిమాల్లో నటించాను.ఇక ఓ సినిమా సమయంలో సుమన్ కొట్టగానే కోపంతో రగిలి పోయే రియాక్షన్ ఇవ్వాలి.

ఆ సమయంలో కాస్త ఎక్స్ప్రెషన్ మిస్సయింది.దీంతో అక్కడే ఉన్న కోడైరెక్టర్ ఇలాంటి దరిద్రపు నాకొడుకులంతా సినీ ఇండస్ట్రీకి వచ్చి చస్తారు.

అందుకే ఇండస్ట్రీ నాశనం అవుతుంది అంటూ అందరి ముందే తిట్టాడు.దీంతో ఆ సమయంలో ఎంతగానో ఎమోషనలయ్యా బాధపడ్డాను అంటూ సత్యప్రకాష్ చెప్పుకొచ్చాడు.

తాజా వార్తలు