సింగంకు పాజిటివ్‌ టాక్‌

‘హృదయకాలేయం’ ఫేం సంపూర్నేష్‌బాబు హీరోగా మంచు విష్ణు నిర్మాణంలో తెరకెక్కిన ‘సింగం123’ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ సినిమాపై అంచనాలను తారా స్థాయికి తీసుకు వెళ్లింది.

ఇక తాజాగా ఈ సినిమా ప్రీమియర్‌ షోకు మంచి స్పందన వచ్చింది.రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు పాజిటివ్‌ టాక్‌తో రాబోతుంది.

ఈ సినిమాలో సంపూ చెప్పిన పవర్‌ ఫుల్‌ డైలాగ్స్‌ ఇప్పటికే బుల్లి తెరపై సండది చేస్తున్నాయి.ఈ సినిమాలో సంపూర్నేష్‌బాబు ఒక పవర్‌ ఫుల్‌(?) పోలీస్‌గా కనిపించబోతున్నాడు.సినిమా ఆరంభం నుండి చివరి వరకు నవ్విస్తూనే ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

ఈ సినిమాను ప్రముఖ హీరో అయిన మంచు విష్ణు నిర్మించడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.ఇంతటి భారీ అంచనాలతో పాటు, పాజిటివ్‌ టాక్‌ కూడా ఉన్న ఈ సినిమా రేపు తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సినీ వర్గాల వారు అంటున్నారు.

Advertisement
సితార హోటల్ ల్లో రాజమౌళి , హీరో అజిత్ ..అద్భుతమైన దృశ్యం

తాజా వార్తలు