ప్రేమ, స్నేహం, బ్రేకప్‌ల 'సమ్మేళనం'

ప్రేమ, స్నేహం, బ్రేకప్ వంటి అంశాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమే.

ఈ భావోద్వేగాలను నాటకీయంగా మలిచిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు (web series)ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.

ఇప్పుడు అచ్చం అలాంటి కథాంశంతో తెరకెక్కిన ‘సమ్మేళనం’ వెబ్ సిరీస్(sammelanam web series) ఈటీవీ విన్ ఓటీటీలో ఫిబ్రవరి 20 నుంచి అందుబాటులోకి వచ్చింది.విడుదలైన వెంటనే ఈ సిరీస్ ట్రెండింగ్‌లో నిలిచింది.

ప్రియా వడ్లమాని, గణ ఆదిత్య, విజ్ఞయ్ అభిషేక్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ఈ సిరీస్‌ను దర్శకుడు తరుణ్ మహాదేవ్ అద్భుతంగా మలిచాడు.

Sammelanam Web Series Trending On Etv Win A Clean Family Drama With Emotional De

బి.సునయని, సాకేత్.జె నిర్మాతలుగా వ్యవహరించారు.

Advertisement
Sammelanam Web Series Trending On Etv Win A Clean Family Drama With Emotional De

కొత్త నటీనటులతో సున్నితమైన భావోద్వేగాలను మిళితం చేస్తూ, కుటుంబం అంతా కలిసి చూడగలిగేలా ఈ సిరీస్‌ను రూపొందించారు.ఓటీటీ కదా అని అడల్ట్ కంటెంట్‌కి స్పేస్ ఇవ్వకుండా, క్లీన్ ఎంటర్‌టైన్మెంట్‌గా అందించారనే విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

ఇక వెబ్ సిరీస్ చూసిన వారు మొదటి రెండు ఎపిసోడ్‌లు నెమ్మదిగా నడిచినా, మూడో ఎపిసోడ్ నుంచి కథలో జోరు పెరిగిందని అంటున్నారు.కథనం, విజువల్స్, మ్యూజిక్ అన్నీ కలిసొచ్చేలా తీర్చిదిద్దారు.

ముఖ్యంగా శ్రావణ్ జీ కుమార్ విజువల్స్, శరవణ వాసుదేవన్, యశ్వంత్ నాగ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.ప్రస్తుతం ‘సమ్మేళనం’ వెబ్ సిరీస్ ఈటీవీ విన్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

ఓటీటీ అభిమానులు కుటుంబ సమేతంగా తప్పకుండా ఈ సిరీస్‌ను చూడవచ్చు.

Sammelanam Web Series Trending On Etv Win A Clean Family Drama With Emotional De
బన్నీ అట్లీ కాంబినేషన్ మూవీలో హీరోయిన్ ఈమేనా.. ఈ ఆఫర్ తో దశ తిరిగినట్టే!
ఆ ఆలోచన వచ్చిన తొలి హీరో చిరంజీవి.. ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు వైరల్!

మరోవైపు వీకెండ్ వస్తుండడంతో ఈ వెబ్ సిరీస్ మరింత దూసుకుపోనుంది.ఇక కుటుంబ సమేతంగా ఈ వారాంతం సంతోషంగా ఇంట్లోనే కూర్చొని ఓటీటీ ప్లాట్ఫారం ద్వారా వెబ్ సిరీస్ చూడవచ్చు.ఇంకేంటి ఆలస్యం.

Advertisement

మీరు కూడా ఈ వెబ్ సిరీస్ చూసి మీకు ఏమనిపించింది ఒక కామెంట్ చేయండి.

తాజా వార్తలు