వారసుడొచ్చాడు-అతడు సినిమాల్లో పోలికలు.. తనికెళ్ల భరణి రాసిన సన్నివేశానికి కన్నీళ్లు రాక మానవు..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ మొదట "నువ్వే నువ్వే" సినిమాని డైరెక్ట్ చేశాడు.దాని తర్వాత దర్శకుడిగా అతను చేసిన సినిమా "అతడు".

( Athadu ) మహేష్ బాబు, త్రిష హీరోహీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కి సూపర్ హిట్ అయింది.ఇందులో మహేష్ ఒక ప్రొఫెషనల్ కిల్లర్.

పార్ధు చనిపోయాక అతని స్థానంలో వాళ్లింటికి వెళ్తాడు.పార్ధు చిన్నప్పుడే ఇంటి నుంచి వెళ్ళిపోతాడు.

పెద్దయ్యాక ఇంటికి వెళ్లాలనుకుంటాడు.అదే విషయాన్ని మహేష్‌కి( Mahesh Babu ) చెప్తాడు.

Advertisement

తన కళ్లముందే పార్ధు చనిపోతాడు.మహేష్ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి తానే పార్ధునంటూ అతని ఇంటికి వెళ్తాడు.

ఆ కుటుంబంలో పార్ధుగా కలిసిపోతాడు.నిజానికి వెంకటేష్( Venkatesh ) మూవీ "వారసుడొచ్చాడు"లో( Varasudochadu ) కూడా సేమ్ ఇదే స్టోరీలైన్ ఉంటుంది.

అందులో కూడా వాసు అనే ఓ వ్యక్తి చిన్నప్పుడు ఒక అబ్బాయి మరణానికి కారణమవుతాడు.ఆపై ఇంటి నుంచి వెళ్లిపోతాడు.

ఆ వ్యక్తి టీబీ జబ్బుతో బాధపడుతూ కొద్దిరోజుల్లో చనిపోతానని వెంకటేష్ చెప్తాడు.అతని కోరిక మేరకు తానే వాసు అని చెప్పుకుంటూ వెంకటేష్ మృతుడి ఇంటికి వెళ్తాడు.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?

వారసుడొచ్చాడు - అతడు సినిమాలు చాలా సిమిలారిటీస్ కలిగి ఉంటాయి.

Advertisement

విచిత్రం ఏమిటంటే "వారసుడొచ్చాడు" సినిమాకు తనికెళ్ల భరణి( Tanikella Bharani ) రైటర్‌గా వర్క్ చేశారు. త్రివిక్రమ్ "అతడు" మూవీ స్టోరీ నెరేట్ చేసినప్పుడు తనికెళ్ల భరణికి తన "వారసుడొచ్చాడు" సినిమా కచ్చితంగా గుర్తుకు వచ్చే ఉంటుంది.భరణి మంచి నటుడే కాదు గొప్ప రచయిత కూడా.

తనికెళ్ల భరణిని నటుడిగానే చూస్తున్నారు కానీ ఆయన్ను మంచి రచయితగా ఈ తరం దర్శకులు గుర్తించకపోవడం బాధాకరం.

భరణి మాటలను అద్భుతంగా రాస్తారు.అప్పటి సినిమా అభిమానులకు బాగా ఇష్టమైన మాటల రచయితల్లో భరణి ముందు వరుసలో ఉండేవారు.ఆయన సినిమాల కోసం రాసిన మాటలు వింటుంటే చాలా ఎమోషన్ రాకపోతే తప్పదు.

ఉదాహరణకు వారసుడొచ్చాడు సినిమాలోని ఒక సన్నివేశాన్ని తీసుకుందాం.ఇందులో నిర్మలమ్మ, వెంకటేష్ మధ్య ఒక సీన్ ఉంటుంది.

చిన్నప్పుడే తప్పిపోయిన వాసు అనే అబ్బాయి స్థానంలో వెంకటేష్ వస్తాడు.తానే వాసు అంటూ వాసు తల్లి నిర్మలమ్మకు చెప్పి నమ్మిస్తాడు.

మళ్లీ వస్తాడో రాడో అని నిర్మలమ్మ 18 ఏళ్లుగా వాసు కోసం ఎదురుచూస్తుంది.ఇక రాడేమో అనుకుంటున్న సమయంలో అమ్మ నేను వచ్చేసా అంటూ కొడుకు తన కళ్ల ముందుకు వచ్చేసరికి నిర్మలమ్మ నమ్మలేకపోతోంది.

వాసు నిద్రపోతుంటే నిర్మలమ్మ విసనకర్రతో ఊపుతూ ఉంటుంది, ఓ అర్థరాత్రి వాసుకు మెలకువ వస్తుంది.విసనకర్రతో వీస్తున్న తల్లిని చూసి ఆశ్చర్యంగా "నువ్వింకా నిద్రపోలేదా అమ్మా" అని ప్రశ్నిస్తాడు.అప్పుడు ఆమె బదులిస్తూ "పద్దెనిమిది సంవత్సరాలు కళ్ళల్లో వత్తులేసుకుని ఎదురు చూసిన కొడుకు, ఈరోజు ఎదురొచ్చి అమ్మా అని పిలిస్తుంటే ఇది కలో నిజమో నమ్మలేకపోతున్నానయ్యా, కళ్లు మూస్తే ఇది కూడా కలైపోతుందేమోనని భయంతో కళ్లు మూతపడటం లేదు బాబూ" అంటుంది.

ఈ సీన్ చూస్తే కళ్లలో నీళ్లు తిరగక తప్పవు.అంత గొప్పగా ఈ సన్నివేశాన్ని, అమ్మ పాత్రను తనికెళ్ల భరణి రాసుకున్నారు.సినిమా కథను, పాత్రలను ఎంతగానో ప్రేమిస్తే తప్ప కళ్లలో నీళ్లు తిరిగేలాగా రాయడం అసాధ్యం.

భరణి ప్రతి క్యారెక్టర్ కూడా తన కన్నబిడ్డలే అన్నంత ప్రేమగా వాటిని డెవలప్ చేస్తారు.త్రివిక్రమ్ నవలలు, సినిమాల నుంచి ఇన్స్పైర్ అయ్యి తన సినిమాలు తీయడం కొత్తదేం కాదు.

వారసుడొచ్చాడు సినిమాలోని మంచి సన్నివేశాలను ఆయన అతడు సినిమాలో ఇంకాస్త గొప్పగా చూపించి ఉండొచ్చు.వారసుడు సినిమా చాలా బాగుంటుంది.

ఇందులోని పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి.అచ్చ తెలుగు గ్రామీణ ప్రాంతంలో తీసిన ఈ సినిమాని యూట్యూబ్ లో చూడవచ్చు.

తాజా వార్తలు