Samantha Health Condition : సమంత హెల్త్ పై వస్తున్న వార్తలు నిజమేనా.. ఆమె టీమ్ ఏం చెప్పిందంటే?

సమంత ఇటీవల కాలంలో ఎంతగా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఒకవైపు నాగ చైతన్య తో విడాకులు.

మరో వైపు ఈమె హెల్త్ ఇష్యుస్ వల్ల ఈమె ఇండియాలోనే బాగా పాపులర్ అయ్యింది.విడాకులు తీసుకున్న తర్వాత పుష్ప సినిమా లో సమంత ఐటెం సాంగ్ చేసి అందరి చేత శబాష్ అనిపించు కుంది.

ఇక ఆ తర్వాత వరుస సినిమాలు లైన్లో పెట్టింది.వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ వస్తున్న సమయంలోనే ఈమె అనారోగ్యం పాలు అయ్యింది.

దీంతో సమంత ఇండస్ట్రీకి కొద్దీ రోజులు పూర్తిగా దూరం అయ్యింది.ఏమయ్యిందో ఏంటో అని సమంత ఫ్యాన్స్ అంతా చాలా ఖంగారు పడ్డారు.

Advertisement

ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సామ్ కొద్దీ రోజులు ఏ పోస్ట్ చేయక పోవడంతో వీరి ఆందోళన మరింత పెరిగింది.దీంతో ఈమెపై చాలానే రూమర్స్ వినిపించాయి.

ఇవన్నీ చుసిన సామ్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా తనకు ఉన్న హెల్త్ ఇష్యు గురించి చెప్పి మరింత షాక్ ఇచ్చింది.సామ్ గత కొన్నాళ్లుగా మయోసైటీస్ అనే వ్యాధితో పోరాడుతున్నానని సోషల్ మీడియా వేదికగా చెప్పి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది.

ఈ విషయం తెలిసిన తర్వాత సినీ ప్రముఖులు, ఆమె ఫ్యాన్స్ సామ్ త్వరగా ఈ సమస్య నుండి బయట పడాలని కోరుకుంటూ పోస్టులు పెట్టారు.ఈమె కొద్దిగా కోలుకుంటున్నానని మెల్లగా ఈ వ్యాధి నుండి బయట పడతానని అందుకు కొంత సమయం పడుతుంది అని మీరు చూపించే ప్రేమతో తప్పకుండ బయట పడతానని.

చెప్పడంతో కొద్దిగా ఫ్యాన్స్ శాంతించారు.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

అయితే గత రెండు రోజులుగా మీడియాలో ఈమె ఆరోగ్యం మరింత క్షీణించింది అని న్యూస్ లు వైరల్ అయ్యాయి.మరి ఈ వార్తలపై ఆమె టీమ్ స్పందించింది.కావాలనే కొంతమంది సామ్ హెల్త్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.

Advertisement

ఆమె ప్రెజెంట్ ఈ వ్యాధికి చికిత్స చేసుకుంటుంది అని మెల్లగా కోలుకుంటున్నారని.దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని చెప్పినట్టు తెలుస్తుంది.

దీంతో ఈమె ఫ్యాన్స్ కంగారును చెక్ పడింది.