Samantha Yashoda : సమంత సూపర్ డెడికేషన్..!

స్టార్ హీరోయిన్ సమంత నటించిన యశోద సినీమ నవంబర్ 11న రిలీజ్ కాబోతుంది.

హరి హరీష్  డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు.

సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతున్న యశోద సినిమాలో సమంత భారీ యాక్షన్ సీన్స్ చేసింది.ఈ సీన్స్ చేయడంలో సమంత ఎంతో కష్టపడ్డది.

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా యశోద సినిమాలోని యాక్షన్ సీన్స్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు చిత్రయూనిట్.ఈ యాక్షన్ సీన్స్ చూస్తే సమంత ఏ రేంజ్ లో కష్టపడ్డదో అర్ధమవుతుంది.

కెరియర్ లో వెనకపడ్డ ప్రతిసారి రెండింతల ఫోర్స్ తో ముందుకొస్తుంది సమంత.యశోదతో పాటుగా శాకుంతలం సినిమా కూడా చేస్తుంది సమంత ఆ సినిమాలో కూడా టైటిల్ రోల్ పోశిస్తూ సత్తా చాటుతుంది.

Advertisement

గుణశేఖర్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న శాకుంతలం సినిమాని నీలిమ గుణ నిర్మిస్తుండగా దిల్ రాజు సమర్పకులుగా ఉన్నారు.అసలైతే నవంబర్ లో శాకుంతలం సినిమానే రిలీజ్ చేయాల్సి ఉండగా అది కాస్త వాయిదా పడ్డది.

యశోద యాక్షన్ కొరియోగ్రఫీ ని హాలీవుడ్ యాక్షన్ ఫైట్ మాస్టర్ యానిక్ బెన్ కంపోజ్ చేశారు.ఎన్నో హాలీవుడ్ సినిమాలకు ఫైట్ కంపోజ్ చేసిన ఆయా యశోదకి స్పెషల్ గా యాక్షన్ డిజైన్ చేశారు.

Advertisement

తాజా వార్తలు